దారుణం : పడుకున్న కుక్క మీద రోడ్డేశారు!

Thursday, June 14th, 2018, 12:00:15 AM IST


ప్రస్తుత రోజుల్లో కొందరు ప్రవర్తిస్తోన్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ముగ జీవుల ప్రాణాలను లెక్క చేయకుండా చిన్న అజాగ్రత్తల వల్ల ఉసురు తీస్తున్నారు. రీసెంట్ గా దేశ రాజధానిలో జరిగిన ఘటన అందరిని కదిలించింది. నిద్రపోతున్న శునకం పైభయంకరంగా తారు రోడ్డు చెశారు. దీంతో ఢిల్లీలో ఈ ఘటన వివాదాస్పదంగా మారింది. ఆగ్రాలోని ఫతేబాద్ లో కొందరు అధికారుల సమక్షంలో రోడ్డు వేస్తున్నారు. అయితే ఒక కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల రోడ్డు మీద కుక్క ఉన్న విషయాన్ని గమనించకుండా అలానే వేడి తారు పోయడంతో ఇరుక్కుపోయిన కుక్క విల విల లాడుతూ ప్రాణాలు విడిచింది. దీంతో సామజిక కార్యకర్తలు ఘటనపై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. అయితే తెల్లారేసరికి కుక్క శరీరం అక్కడ కనిపించలేదు. ఆందోళన కారులు మరింతగా నిరసనలు తెలిపి పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. ఘటనకు సంబందించిన అధికారులను వెంటనే అరెస్ట్ చేయాలనీ సామజిక కార్యకర్తలు కొందరు డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో కూడా ఘటనపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments