యజమాని కిందపడిపోతే ఆ కుక్క ఏం చేసిందో చుడండి!

Tuesday, June 26th, 2018, 06:46:05 PM IST

ఈ ప్రపంచంలో అత్యంత నమ్మకంగా ఉండే శునకం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలాంటి సమయంలో అయినా తనకు అన్నం పెట్టిన యజమానిని ఏ కుక్క మర్చిపోదు. అయితే శునకాలకు ట్రైనింగ్ ఇస్తే అవి ఇంకా ఉపయోగపడతాయని కొంత మంది నీరుపిస్తుంటారు. అసలు విషయంలోకి వస్తే.. సాధారణంగా ఎవరైనా సడన్ గా గుండె నొప్పితో గాని లేదా ఇతర ప్రాణాపాయ స్థితిలో కింద పడిపోతే డాక్టర్లు గుండె పనిచేస్తుందా లేదా అని ముందుగా ప్రయత్నం చేస్తారు.

వెంటనే ఛాతీమీద నొక్కడానికి ప్రయత్నం చేస్తారు. అయితే అలా కిందపడిపోయిన తన ట్రైనర్ కు శునకం ఊహించని విధంగా ప్రాణాలను నిలపడానికి ప్రయత్నం చేసింది. స్పెయిన్ లోని మాడ్రిడ్‌కు చెందిన అధికారి కావాలని స్పృహ కోల్పోయి శునకాన్ని టెస్ట్ చేశాడు. అయితే ఆ శునకంగ్ అతని ఉపిరినిక్ సైతం టెస్ట్ చేసింది. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. ఆ శునకానికి ఇంకా శిక్షణ ఇస్తే చాలా బాగా ఉపయోగపడుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేశారు.