ట్రంప్ కి ఎలాంటి రోగాలు లేవు..71లో కూడా ఫిట్!

Saturday, January 13th, 2018, 11:35:14 AM IST

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసే వ్యాఖ్యలు ఏ విధంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరు సమానం అంటునే జాతి వివక్ష చూపిస్తున్నారని ఎంతో మంది కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ట్రంప్ పాలన తీరుపై అక్కడ 60% ప్రజలు విమర్శలను వ్యక్తం చేస్తున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. అంతే కాకుండా అతనికి మతి స్థిమితం లేదని సోషల్ మీడియాలో ప్రచారం బాగానే జరిగింది.దీంతో ట్రంప్ ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు ఎలాంటి మానసిక జబ్బు లేదని స్మార్ట్ బాయ్ ని అంటూ తనకు తానే ప్రశంసలను అందించుకున్నాడు.

71 ఏళ్ల వయసున్న ట్రంప్ సవాల్ చేస్తూ వైద్య పరీక్షలను కూడా చేయించుకున్నాడు. వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్‌ సెంటర్‌లో డాక్టర్‌ రోనీ జాక్సన్‌ నిర్వహించిన పరీక్షల్లో ట్రంప్ కి ఎలాంటి మానసిక జబ్బులు లేవని వివరణ ఇచ్చారు. గత కొన్నేళ్లుగా చాలా మంది ప్రముఖులకు రోనీ జాక్సన్‌ వైద్య పరీక్షలు చేస్తున్నాడు. ఇంతకుముందు ఉన్న కొంత మంది అధ్యక్షులకు కూడా రోనీనే వైద్య పరీక్షలు చేశాడు.అదే తరహాలో ట్రంప్ కి కూడా బీపీ – కొలెస్ట్రాల్‌ అలాగే బ్లడ్‌ షుగర్‌ గుండె స్పందన బరువు వంటి పరీక్షలు చేసి ఆయన చాలా ఫిట్ గా ఉన్నారని ఎలాంటి అనుమానాలు అవసరం లేదని మీడియాకు వివరణ ఇచ్చాడు.