ట్రంప్ టైం స్టార్ట్స్ ..అమెరికా 45 వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్..!

Friday, January 20th, 2017, 11:00:06 PM IST

trump
అమెరికాలో సరికొత్త అధ్యాయం మొదలైంది. అమెరికా 45 వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ కొద్దీ సేపటి క్రితమే ప్రమాణ స్వీకారం చేశారు. ఉపాధ్యక్షుడిగా మైక్ పెన్స్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం వాషింగ్టన్ డిసి లో జరిగింది. ప్రమాణ స్వీకార అనంతరం అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తొలి ప్రసంగం చేశారు. అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్ దీనిని ప్రజా విజయంగా వర్ణించారు. ఒబామా తో సహా మాజీ అధ్యక్షులందరికి ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు.

ట్రంప్ ప్రమాణ స్వీకారాన్ని తిలకించేందుకు దేశ విదేశాలనుంచి అతిరథ మహారధులు హాజరయ్యారు. భారీగా ప్రజలు శ్వేత సౌధంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని హాజరు కాగా భారీ భద్రతని ఏర్పాటు చేసారు.ప్రమాణ స్వీకారం అనంతరం ఒబామాకు కరచాలనం అందించిన ట్రంప్ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించారు. తిరిగి అమెరికాని అన్ని రంగాల్లో మొదటిస్థానం లో నిలబెడతానని ట్రంప్ అన్నారు.