బ్రేకింగ్ న్యూస్ : మాలాంటి ధనవంతులకు అక్రమ సంబంధాలు కామనే :డొనాల్డ్ ట్రంప్

Friday, May 4th, 2018, 04:05:32 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దూకుడు – వ్యక్తిత్వం ఎలా ఉంటుందో మరోమారు విస్పష్టంగా తెలియజెప్పారు. డొనాల్డ్ ట్రంప్ తో తనకు అక్రమసంబంధం ఉందని స్టోర్మీ డేనియల్స్ ఫోర్న్ స్టార్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ట్రంప్ తో తనకు అక్రమ సంబంధం ఉందని ఆరోపించిన స్టోర్మీ విషయం బయటకు పొక్కకుండా ఉంచేలా తనతో బలవంతంగా సంతకం చేయించాడని ఇందుకోసం డబ్బులు ముట్టాచెప్పారని ఆరోపించింది. 2016లో తాను ఓ ఒప్పంద పత్రంపై బలవంతంగా సంతకం చేశానని పేర్కొంటూ కోర్టును ఆశ్రయించింది. అయితే స్టోర్మీ చేసిన ఆరోపణలను ట్రంప్ గతంలో ఖండించారు. కాగా చిత్రంగా ఆయన ఇప్పుడు ఒప్పుకొన్నారు. అంతేకాదు..ఇది చాలా కామన్ అని వెల్లడించారు.

ఫోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్తో శారీరక సంబంధం కొనసాగించినందుకు గాను ట్రంప్ ఆమెకు డబ్బులను చెల్లించినట్టు న్యూయార్క్ మాజీ మేయర్ రుడీ గిలియానీ సంచలన ప్రకటన చేశారు. ట్రంప్ తో అఫైర్ ను బయటపెట్టకుండా ఉండేందుకు ఆయన న్యాయవాది మైకేల్ కోహెన్ తనకు 130000డాలర్లు చెల్లించారని ఆమె దావాలో పేర్కొంది. అయితే తాజాగా న్యూయార్క్ మాజీ మేయర్ రుడి గిలియానీ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. 2016 నవంబర్ మాసంలో ఫోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ తో ట్రంప్ ఒప్పందాన్ని కుదుర్చుకొన్నాడని ఆయన ప్రకటించారు. ట్రంప్ వద్ద సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న లాయర్ మైఖేల్ కోహెన్ వద్ద నుండి ఫోర్న్స్టార్ డేనియల్ తాను చేసుకొన్న ఒప్పందం మేరకు నగదును తీసుకొందని ఆయన చెప్పారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఫోర్న్స్టార్కు చెల్లించిన నగదుకు సమానమైన మొత్తాన్ని ట్రంప్ మైఖేల్ కోహెన్కు చెల్లించారని ప్రకటించి కలకలం రేకెత్తించారు. అయితే న్యూయార్క్ సిటీ మాజీ మేయర్ రుడాల్ఫ్ గిలియాని ఓ మీడియాతో చెప్పిన కొద్దిసేపట్లోనే ట్రంప్ తన ట్విట్టర్ ద్వారా ఇది నిజమేనంటూ ట్వీట్ చేశారు.

పోర్న్ స్టార్ స్టార్మీ డేనియెల్స్ తో తనకు అక్రమసంబంధం ఉన్న మాట నిజమేనని ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఉండేందుకు ఆమెకు రూ.87 లక్షలు చెల్లించిన మాట వాస్తమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం అంగీకరించారు. సెలబ్రిటీస్ కు డబ్బున్నవాళ్లకు ఇవి కామన్ అని ట్రంప్ అన్నారు. అయితే అధ్యక్ష ఎన్నికల ప్రచార ఖర్చులకు ఆ డబ్బులకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికలకు కొన్నిరోజుల ముందు తన లాయర్ మైఖేల్ కొహెన్ ఓ న్యాయసంస్థ ద్వారా డేనియెల్స్ కు డబ్బు ఇచ్చారని ఆ తర్వాత ఆ మొత్తాన్ని కొహెన్ కు తాను విడతలవారీగా చెల్లించినట్లు ట్రంప్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనతో ఎటువంటి అక్రమ సంబంధమేమీ లేదంటూ ఓ లేఖపై డేనియెల్స్ గతంలో సంతకం చేసినప్పటికీ ఆ బప్పందాన్ని ఆమె ఉల్లంఘించిందని ట్రంప్ తెలిపారు. తనతో అక్రమ సంబంధం ఉందంటూ ప్రచారం చేసినందుకు డేనియెల్స్ పై చర్యలు తీసుకునేందుకు కోర్టుని ఆశ్రయించనున్నట్లు ట్రంప్ తెలిపారు.

Comments