3 లక్షల మంది ఎన్నారైలను రిటర్న్ ఫ్లైట్ ఎక్కించనున్న ట్రంప్ !

Wednesday, February 22nd, 2017, 05:49:09 PM IST


ప్రపంచ దేశాలన్నీ అరచి గగ్గోలు పెడుతున్నా ట్రంప్ మాత్రం పట్టిన పట్టు వదలడం లేదు.ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ చట్టాలను ట్రంప్ కఠినతరం చేస్తుండడంతో ఆ ప్రభావం అమెరికాలో ఉంటున్న కోటి మంది విదేశీయులపై పడనుంది.అందులో 3 లక్షల మంది భారతీయులు ఇంటి దారి పట్టక తప్పనిపరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఇతర దేశాలనుంచి వచ్చి అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారికి తమ శాఖ ఎలాంటి మినహాయింపులు ఇవ్వదని, వారిని ఏరిపారేసే ప్రక్రియ కొనసాగుతుందని డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఓ ప్రకటన లో పేర్కొంది.

ఈ చట్టం ప్రధాన లక్ష్యం నేరస్థులను ఏరిపారేయడమే. కానీ దీనిప్రభావం అమెరికా వెళ్లి చిన్న చిన్న వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకునే వారిపై పడనుంది. దాదాపు 3 లక్షల మంది భారతీయులు తగిన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్నట్లు తెలుస్తోంది. వీరందరికి ముప్పు తప్పదని అంటున్నారు.మైనర్లు, ఆశ్రయం పొంది వచ్చిన వారికిమాత్రం మినహాయింపు ఉండొచ్చని అంటున్నారు.