సగం కొరికిన పండ్లను తినకండి…..‘నిఫా వైరస్’ సోకొచ్చు!

Friday, May 25th, 2018, 03:20:53 AM IST

ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో పలువురి మరణానికి దారి తీసిన అతిభయంకరమైన వైరస్, నిఫా వైరస్ గా డాక్టర్లు తేల్చిన విషయం తెలిసిందే. ఇటీవల కేరళలో ఒక గ్రామంలో ఒక కుటుంబంలోని వారికి ఈ వైరస్ సోకి వారు మంచాన పడడంతో వారికి ట్రీట్ మెంట్ అందించే నిమిత్తం అక్కడకు వెళ్లిన నర్స్ కి కూడా ఆ వైరస్ సోకి మరణించిన విషయం యావత్ భారతదేశాన్ని ఒక కుదుపు కుదిపింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ నిఫా వైరస్ గురించి ఆయా ప్రభుత్వాలు ప్రజలకు అవగాహనా కల్పించే పనిలో వున్నాయి. నిజానికి ఈ వైరస్ కు ఇప్పటివరకు మందు లేదని, అవకాశం ఉన్నంత వరకు ఈ వైరస్ సోకకుండా ఉండేలా ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. నిజానికి ఈ వైరస్ గబ్బిలాలు, ఇతర అడవుల్లో తిరిగే రకరకాల ప్రాణుల నుండి, అవికొరికిన పండ్లు, కాయల నుండి సోకుతోందని డాక్టర్లు చెపుతున్నారు.

ముఖ్యంగా చెట్లు ఎక్కువగా వున్న ప్రాంతాల్లో కోసిన పండ్లను తినే ముందు ఒకటికి రెండుసార్లు పూర్తిగా నీళ్లతో శుభ్రం చేసి తినాలని, అంతే కాదు ఒకవేళ ఏవైనా పండ్లు సగం, కానీ లేదా అక్కడక్కడా అయిన కొరికినట్లు అనిపిస్తే వాటిని వెంటనే పడవేయాలని వారు అంటున్నారు. పల్లెటూళ్లలో తాటి, ఈత చెట్లనుండి తీసే కల్లు తాగేటపుడు కూడా జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. అలానే మన ఇంటిలోని ఆహారపదార్ధాలను ఎప్పుడు మూతపెట్టి ఉంచాలని చెపుతున్నారు. ఈ వ్యాధి సోకినా వారు మెదడులోని నాదీ వ్యవస్థ పనిచేయదని, విపరీతమైన శ్వాసకోశ సమస్య, జ్వరం నీరసంతో బాధపడుతుంటారని, అటువంటి లక్షణాలు ఎవరితోనైనా కనపడితే వెంటనే సమీప డాక్టరును సంప్రదించామని వైద్యులు ముఖ్యంగా సూచిస్తున్నారు. ఇప్పటికే కేరళ రాష్ట్రం సహా దేశం మొత్తం ఈ వైరస్ పై హై అలెర్ట్ ప్రకటించాయి. సో! బీ కేర్ ఫుల్ అండ్ బీ అలెర్ట్ ఆన్ నిఫా వైరస్…….

  •  
  •  
  •  
  •  

Comments