నన్ను విలన్ ని చేయకండి…..అది ఫేక్ న్యూస్ : ప్రీతి జింతా

Sunday, May 13th, 2018, 04:28:54 PM IST

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఓనర్ ప్రీతీ జింతా ఒక పత్రికపై ఫైర్ అయ్యారు. విషయంలోకి వెళితే గతవారం ఐపీఎల్ లో జరిగిన ఒక మ్యాచ్ లో పంజాబ్ జట్టు రాజస్థాన్ రాయల్స్ జట్టు మీద ఓడిపోయింది. ఆ మ్యాచ్ లో కరుణ్ నాయర్, మనోజ్ తివారి వంటి బ్యాట్స్ మాన్ లు ఇంకా బ్యాటింగ్ కు దిగవలసి ఉండగా రవిచంద్రన్ అశ్విన్ ని ముందు ఎందుకు పంపారని ప్రీతీ జింతా, టీం మెంటర్ సెహ్వాగ్ పై వివాదానికి దిగారని, ఫలితంగా ప్రీతీ వ్యాఖ్యలపై ఆగ్రహించిన సెహ్వాగ్ ఆ పదవి నుండి తప్పుకుంటున్నారని, ప్రముఖ పత్రిక ముంబై మిర్రర్ ఒక కథనాన్ని ప్రచురించింది.

అయితే ఈ కథనంపై నేడు ప్రీతీ స్పందిస్తూ ముంబై మిర్రర్ తప్పుగా రాసింది, మా గురించి రాయమని వారికి రాయమని డబ్బులు ఇవ్వడం లేదు కదా, వాళ్ళు రాసినట్లు నాకు, వీరికి మధ్య ఎటువంటి గొడవ జరగలేదు, అదంతా వొట్టి ఫేక్ న్యూస్ అని మండిపడింది. అయితే ఇటువంటి వార్తలు రాయడం సరైనది కాదని, కొన్నిపత్రికలు నిజమెంటో తెలుసుకుని రాయాలని ఆమె హితవు పలికారు. కాగా ప్రీతీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మిడియాలో వైరల్ గా మారాయి…….