ప్రణయ్ కు విగ్రహం వద్దంటే వద్దు అంతే..మరో కొత్త వివాదం!

Tuesday, October 2nd, 2018, 10:37:25 AM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడా లోని కులాంతర వివాహం చేసుకున్నారన్న నేపధ్యంలో ప్రణయ్ అనే వ్యక్తికి అతని ,మావయ్య అతి దారుణంగా హత్య చేయించిన సంగతి పెద్ద వివాదానికి దారి తీసింది అన్న సంగతి తెలిసినదే.దీనిపై అనేక వ్యతిరేకతలు,నిరసనలు వెల్లువెత్తిన సంగతి కూడా తెలిసినదే.కుల వివక్షతో తన భర్తను హత్య చేయించారని అతని భార్య అమృత ప్రణయ్ యొక్క విగ్రహాన్ని మిర్యాలగూడాలో ఏర్పాటు చెయ్యాలని కోరగా అందుకు గాను చాలా మంది మద్దతు పలికారు. అదే సమయంలో అతనికి విగ్రహం అవసరం లేదని ససేమిరా అనే వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉన్నారు.

ఇది వరకే ప్రణయ్ విగ్రహం మిర్యాలగూడా ప్రధాన కూడలిలో ఏర్పాటు చెయ్యొద్దని కావాలంటే వారి ఇంటి వద్ద ఏర్పాటు చేసుకోవాలి అని తల్లిదండ్రుల సంఘాలు,ఇతర సంఘాల వారు కోరారు.ఇప్పుడు మాత్రం అసలు ప్రణయ్ కు విగ్రహం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వద్దని,ఇప్పటికే వారి తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి 4 లక్షల పరిహారాన్ని కూడా వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు.ఎందుకనగా ప్రణయ్ కుటుంబీకులు ఎస్సీ వర్గంలో ఉన్నపుడే వారు క్రైస్తవ మతాన్ని స్వీకరించారని మరి అలాంటప్పుడు వారు బీసీ-సి లోకి చేరుతారని,అలాంటప్పుడు కుల వివక్షత పేరు చెప్పి అతనికి ఎలా విగ్రహం ఏర్పాటు చేస్తారని,ప్రభుత్వం కూడా ఇచ్చిన పరిహారాన్ని వెనక్కి తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.