మీ స్వార్ధం కోసం ఏపీ గుండెని లాగేయకండి : కన్నా

Thursday, July 12th, 2018, 08:41:23 AM IST

గత కొద్దిరోజులుగా టిడిపి మరియు, బీజేపీల మధ్య మాటల యుద్ధం అంతకంతకు పెరుగుతోంది. ఏపీకి విభజన హామీలు, ప్రత్యేక హోదా విషయమై ఇచ్చిన మాటను బీజేపీ తప్పిందని టీడీపీ వారు అంటుంటే, టీడీపీ చెపుతున్నవన్నీ అసత్యాలని, గత ఎన్నికల సమయంలో ఏపీకి ఇచ్చిన మాటప్రకారం దాదాపుగా అన్ని హామీలు కూడా నెరవేర్చడం జరిగిందని బీజేపీ నేతలు చెపుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం మా నుండి సాయం పొంది కూడా లేదని మా మీద బురద చల్లె ప్రయత్నం చేస్తోందని వారు అంటున్నారు. అలానే ఏపీకి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన పోలవరం విషయమై కూడా రెండు పార్టీలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం లోటు బడ్జెట్ లో వున్నప్పటికి కూడా చంద్రబాబు పోలవరాన్ని రాష్ట్ర నిధులతో నడిపిస్తున్నారని టిడిపి నేతలు అంటున్నారు.

ఇక ఆంధ్ర ప్రదేశ్ బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మి నారాయణ నేడు మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి గుండె వంటి పోలవరాన్ని కూడా టీడీపీ నేతలు రాజకీయం చేయాలనీ చూస్తున్నారు, గుండెను మీ స్వార్ధ రాజకీయ కోసం లాగేయకండి అని చంద్రబాబు చేస్తున్న రాజకీయం పై విమర్శించారు. ఇప్పటికే కేంద్రము ఇచ్చిన నిధులను తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడేమో మా నుండి ఎటువంటి నిధులు రాలేదనడం సమంజసం కాదని అన్నారు. ఏపీలో బీజేపీని అణగదొక్కడానికి ఇది చంద్రబాబు, మరియు టీడీపీ నేతలు చేస్తున్న కుట్ర అని అయన మండిపడ్డారు. అంతేకాక ఏపీకి ఎంతో ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజక్టు విషయమై కూడా టిడిపి రాజకీయం చేయడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఆ ప్రాజక్టు యొక్క పూర్తి ఖర్చు కేంద్రానిదేనని,

దానికి సంబంధించి కేంద్రం వారు ఒక్కరూపాయి కూడా బాకీ లేరని, అయితే కేంద్రానికి ప్రాజక్టు కాంట్రాక్టర్లకు మధ్య కేవలం ఒక వారధిలా మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని, ఈ ప్రాజక్టుతో వారికీ ఏ మాత్రం సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. అయినా ఈ ప్రాజక్టుపై మీ పెత్తనం ఏంటని టీడీపీని ప్రశ్నించారు. అనుకున్న సమయానికల్లా మా పార్టీ ఈ ప్రాజక్టును పూర్తిచేసి తీరుతుందని స్పష్టం చేసారు. కావున ఇప్పటికైనా చంద్రబాబు గారు వాస్తవాలు మాట్లాడి ప్రజల్లోకి వెళ్లాలని, అయినా ప్రస్తుతం టీడీపీ పాలనపై ప్రజలు పూర్తిగా అసంతృప్తితో వున్నారని, రానున్న ఎన్నికల్లో వారికీ గట్టిగా బుద్ధిచెపుతారని అన్నారు. ఏపీలో బీజేపీ పరిస్థితీ మునుపటికంటే చాల బాగుందని, రానున్న ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధించి అధికారంలోకి వస్తామని ఆయన ఆశ భావం వ్యక్తం చేసారు….

  •  
  •  
  •  
  •  

Comments