ఓటును ఆల్క‌హాల్ .. డ‌బ్బుకు అమ్మేయ‌కు!

Friday, March 15th, 2019, 01:57:40 PM IST

ఓటు వేసే ముందు ఆలోచించు. డ‌బ్బు, ఆల్క‌హాల్ కోసం ఓటేయ‌కు. నువ్వేమీ అడుక్కునేవాడివి కావు. ఓట‌రే రాజును త‌యారు చేసేవాడు. కులం కోసం ఓటేయ‌కు. అది నీ కుటుంబానికి తిండి పెట్ట‌దు. పోష‌ణ‌ను ఇవ్వ‌దు. నీకు, నీ కుటుంబానికి, సంఘానికి మంచి చేసే నాయ‌కుడికే ఓటు వెయ్. ఫేవ‌రెట్ లీడ‌ర్ అనో.. కులం చూసో లేక డ‌బ్బు కోస‌మో ఓటు వేస్తే మార్పు కోరొద్దు. మార్పు నీతోనే సాధ్యం. ఓటు వేసే ముందు ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించు.

సేమ్ టైమ్ `కులం ఫ్యాక్ట‌ర్` ఏపీ రాజ‌కీయాల్ని న‌డిపిస్తున్న సంగ‌తిని మ‌రువ‌కు. కుల రాజ‌కీయాల్ని సమ‌ర్ధించే నాయ‌కులు ఎవ‌రో తెలుసుకో.. అందులో పండిపోయిన వాళ్ల గేమ్ ను అర్థం చేసుకో. వెన‌క‌బాటు ఎందుకో తెలుసుకో`. విద్య‌.. ఉద్యోగం.. ఉపాధి.. అధికారం అన్నిటా మ‌న స్థానం ఎక్క‌డో తెలుసుకో. తెలివైన నిర్ణ‌యం తీసుకో..

ప్ర‌స్తుతం ఏపీ, తెలంగాణ ఎన్నిక‌ల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పాయింట్లు ఇవే. ఓట‌రును చైత‌న్య ప‌ర‌చ‌డం కోస‌మే ఇది. ఆయా కోణాల్లో ఓట‌రు చైత‌న్య వంతుడు అయితే అస‌లు ఉత్త‌మ మైన నాయ‌కుడు ఎవ‌రు? అభివృద్ధికి ప‌ని చేసేవాడు ఎవ‌డు? అన్న‌ది వెతుక్కునే వెసులుబాటు క‌లుగుతుంది సామాన్య ఓట‌రుకు. రాజ‌కీయాల్ని ఏ కోణంలో చూడాలి? అన్న క‌న్ఫ్యూజ‌న్ చాలా మంది సామాన్యుల్లో ఉండి ఉండొచ్చు. మునుప‌టితో పోలిస్తే విద్యావంతులు గ్రామాల్లోనూ పెరిగారు కాబ‌ట్టి తెలివైన నిర్ణ‌యాలు తీసుకుంటార‌నే `నేటి ఏపీ` ఆశిస్తోంది.