సెల్ టు హెల్ : సెల్ లో మాట్లాడుతూ యాక్సిడెంట్ చేసిన యువకుడు

Wednesday, July 11th, 2018, 05:35:09 PM IST

నేటి సమాజంలో ఎవరైనా జేబులో పెన్ లేకుండా కనపడుతున్నారేమో కానీ, సెల్ లేకుండా మాత్రం కనపడడం లేదు. ఒకప్పుడు ధనికులకు మాత్రమే అందుబాటులో వుండే ఈ సెల్ ఫోన్, అమాంతం రేట్లు తగ్గు ముఖంపట్టడం, రోజురోజుకు రకరకాల మోడల్స్ అందుబాటులోకి వస్తుండడంతో అందరికి ఇప్పుడు ఇది అత్యావశ్యకమైంది. సెల్ ఫోన్ వినియోగం అంతకంతకు ఎక్కువ అవడం ఒక రకంగా మనకు మేలు చేస్తున్నప్పటికీ కొంత కీడు కూడా చేస్తోంది. కొందరైతే పూర్తిగా సెల్ ఫోన్ లోని సోషల్ మీడియా మెసేజెస్, చాటింగ్ లో పడి తమ ఇంట్లోని వారితో సరిగా మాట్లాడడం కూడా మరచిపోయారనేది ఒప్పుకోకతప్పని సత్యం. అంతలా మన జీవితంలో సెల్ ఫోన్ ముఖ్య భాగం అయిపొయింది. కొందరైతే సెల్ మాట్లాడుతూ డ్రైవింగ్ కూడా చేస్తుంటారు.

ఇది నేరమని, దానివల్ల తమ ప్రాణాలకే కాదు, ఎదుటివారి ప్రాణాలకు కూడా ముప్పని ఎంత చెప్పినా వినిపించుకోరు. దీనిపై ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ డ్రైవ్ చేస్తూ సెల్ మాట్లాడేవారు చాల చోట్ల తారసపడుతూనే వున్నారు. ఇక మనం చెప్పుకోబోయే సంఘటన కూడా దీనికి సంబంధించిందే. హైదరాబాద్ లోని ఒక ప్రాంతంలో నేడు ఒక యువకుడు తన బైక్ ని రోడ్ పక్కన ఆపి, తన పని చూసుకుని మళ్ళి బైక్ ఎక్కి బయల్దేరాడు, అయితే ఆ సమయంలో అతడు ఎదురుగా వస్తున్న ఆటోని తప్పించబోయి అటువైపుగా వస్తున్న మరొక బైక్ ని బలంగా ఢీకొట్టాడు. కాగా ఘటనలో యువకుడి తలకు తీవ్ర గాయాలతో ప్రస్తుతం కోమాలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అవతలి బైక్ వారికీ మాత్రం చిన్నపాటి గాయాలయ్యాయట. ఎవరు ఎంత మొత్తుకున్నప్పటికీ సెల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న వారు మాత్రం మారడం లేదు. ఇటువంటి ఘటనలు జరిగాక అయినా, ప్రజలు జాగ్రత్త పడాలని ట్రాఫిక్ పోలీస్ లు విజ్ఞప్తి చేస్తున్నారు…….

  •  
  •  
  •  
  •  

Comments