సూపర్ స్టార్..”మహర్షి” కోసం “దూకుడు” భామ దిగనుందా..?

Friday, December 7th, 2018, 01:05:53 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ “ప్రిన్స్” మహేష్ బాబు నుంచి రాబోతున్న తాజా చిత్రం “మహర్షి”.వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు.మహేష్ ఈ చిత్రంలో మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారు అన్న వార్త ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇప్పుడు ఈ చిత్రంలోకి అదనపు హంగుగా మహేష్ కెరీర్ లోనే బస్టర్ అయినటువంటి “దూకుడు” చిత్రం భామని ఈ చిత్రంలోకి దింపుతున్నట్టు సమాచారం.

దూకుడు భామ అంటే అందులో హీరోయిన్ గా నటించినటువంటి సమంతా కాదు దూకుడు టైటిల్ ట్రాక్ లో కనిపించిన మీనాక్షి దీక్షిత్. ఇప్పుడు మహర్షి సెట్స్ లోకి దిగనుందట.అయితే అయితే ఈమె ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించబోతున్నారు అని ఒక వార్త,ఐటెం సాంగ్ కోసం ఈమెను సంప్రదించగా ఈమె ఓకే చేసినట్టుగా మరో వార్త ఇప్పుడు వినిపిస్తున్నాయి.ఈ రెండిటిలో ఏది నిజం అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు కానీ మొత్తానికి అయితే ఈ చిత్రంలో మీనాక్షి దీక్షిత్ అయితే ఉంది అని తెలుస్తుంది.