వీరికి మంత్రి పదవులు డౌటే… అసలు కారణం ఇదేనా…?

Saturday, February 9th, 2019, 02:03:09 PM IST


తెలంగాణాలో తెరాస పార్టీ రెండవసారి అధికారంలోకి వచ్చి చాలారోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికి తెలంగాణాలో మంత్రివర్గ విస్తరణ జరగనే లేదు… ఇప్పటికి మంత్రివర్గ విస్తరణ మీద ద్రుష్టి సారించారు తెరాస అధినేత కెసిఆర్ గారు… తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు మూహూర్తం దగ్గరపడింది. కాని ఎవరికీ మంత్రి పదవి దక్కుతుందో, ఎవరు ఎమ్మెల్యేగానే ఉండిపోతారో అనేది మరికొన్ని రోజుల్లో తెలియనుంది. అయితే మంత్రి పదవి ఆ ఇద్దరికీ కూడా వచ్చేలా లేదు. వారే కేటీఆర్, హరీష్ రావులు… కెసిఆర్ వారికి మంత్రి పదవి ఇస్తాడా లేక మరేదైనా కీలక బాధ్యతలు అప్పగిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

అయితే టీఆర్‌ఎస్‌ పార్టీ స్తాపించినప్పటినుండి కూడా హరీష్ రావు మాత్రం కెసిఆర్ కి వెనకాలే ఉంటున్నాడు. ఎన్నికల్లో తెరాస పార్టీ నిజయం సాధించడంలో హరీష్ రావు చాలా కీలకమైన పాత్ర పోషించారు. అలాగే టీఆర్‌ఎస్‌ని బలోపేతం చేయడం కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగించారు సీఎం కేసీఆర్‌. కేటీఆర్ కూడా ఆ పదవికి ఇప్పటివరకు న్యాయం చేస్తూనే ఉన్నాడు. అయితే వీరికి ఇద్దరికీ కూడా మొదటి మంత్రి వర్గ విస్తరణలో మంత్రి పదవి దక్కకపోవచ్చు. దానికి కారణం ఏంటంటే, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వీరిద్దరూ కూడా ఇంతకు ముందులాగే పార్టీ బాధ్యతలు తీసుకోని, పార్లమెంటు అన్ని స్థానాల్లో తెరాస అభ్యర్ధులని గెలిపించే దిశగా ప్రయత్నాలు చేయాలనీ, అందుకోసమే వీరికి ఇప్పుడు ఈ బాధ్యతలు అప్పగించారని సమాచారం.