కె.ఏ.పాల్‌తో అర‌బ్ అమెరికా వండ‌ర్ ఉమెన్ గ్లోబ‌ల్ పీస్ ప్ర‌చారం..!

Sunday, January 7th, 2018, 06:16:25 PM IST

ప్ర‌పంచ శాంతిదూత డా.కె.ఏ.పాల్‌తో క‌లిసి మిస్ అర‌బ్ అమెరికా డా.మ‌హ్రా అహ్మ‌ద్ లుఫ్తీ (23) త‌న‌వంతుగా శాంతి సౌభ్రాతృత్వానికి కృషి చేయ‌నున్నారు. లైబీరియా, ఇరాన్‌, హ‌యాతీ నుంచి అమెరికా వంటి ప‌లు దేశాల్లో కె.ఏ.పాల్ శాంతి ప్ర‌చార‌క‌ర్త‌గా, క్రైస్త‌వ మ‌త ఉద్భోద‌కుడిగా సేవ‌లందిస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌డిచిన 30 ఏళ్లుగా ప్ర‌పంచ‌శాంతి, ఐక్య‌త గురించి ప్ర‌చారం నిర్వ‌హిస్తూ త‌న‌వంతు సేవ‌లందిస్తున్నారు.

23 ఏళ్ల మిస్ లుఫ్తీ తొలి అర‌బ్ అమెరిక‌న్‌ మెడిక‌ల్ రెసిడెంట్‌. పాల్‌ త‌ర‌హా శాంతి ఆలోచ‌న‌ల‌తో ప్ర‌పంచ‌దేశాల శాంతి కోసం, ఐక్య‌త కోసం భావ‌సారూప్య‌త‌తో డా.కె.ఏ.పాల్‌తో క‌లిసి కృషి చేసేందుకు ముందుకొచ్చారు. అర‌బ్ దేశానికి చెందిన మొట్ట‌మొద‌టి యువతి కూడా త‌నే. ప్ర‌స్తుతం మిస్ టెక్సాస్ యుఎస్ఏ పేజినెంట్‌గా పోటీలో ఉన్నారు. శాంతి, ఐక్య‌త‌కు సంబంధించి ప్ర‌పంచ చ‌రిత్ర‌లో త‌న‌కో పేజీ కావాల‌ని ఆశిస్తున్న తొలి అర‌బ్ అమెరిక‌న్‌గా మిస్ లుఫ్తీ పేరు మార్మోగిపోనుంది. లుఫ్తీ ఓ గొప్ప మాన‌వ‌తావాది. క్రీడాకారిణి. పైగా వైద్య‌వృత్తిలో ఉన్నారు. అమెరికాలో ఆటిజంతో బాధ‌ప‌డుతున్న బాల‌ల‌కు త‌న‌వంతు సేవ‌లందిస్తున్నారు లుఫ్తీ. ప్ర‌స్తుతం ప్ర‌పంచ శాంతి ఉద్భోద‌కుడితో కలిసి గ్లోబ‌ల్‌పీస్ కోసం త‌న‌వంతు సేవ‌లందించ‌డం హ‌ర్ష‌నీయం.