లైఫ్ స్టైల్ : రోజుకో కోక్ తాగితే మగాళ్ల పని మటాష్

Sunday, July 10th, 2016, 05:35:40 PM IST


కొక కోలా.. ఎన్నో ఏళ్ల నుండి ప్రపంచాన్ని ఒక ఒప్పుతున్న శీతల పానీయం. యూత్ అయితే దీనికి మరీ అడిక్ట్ అవుతున్నారు. రోజూ లీటర్ల కొద్దీ కోలా తాగుతున్నారు. ఇలా కోలా విరగబడి తాగడం వలన అనేక సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మగవాళ్లలో అయితే ఈ సమస్యలు మరీ ఎక్కువవుతాయట.

ఇటీవల డెన్మార్క్ లోనికి కోపెన్ హాగన్ యూనివరిసితీ చేసిన పరిశోధనల్లో ప్రతిరోజూ కోక్ ఎక్కువగా తాగే పురుషుల్లో వీర్య కణాల సంఖ్య 30% వరకూ తగ్గిపోతోందని తేల్చారు. దీని వల్ల పుట్టే పిల్లల్లో లోపాలు కూడా తలెత్తుతాయని చెబుతున్నారు. అంతేగాకా కోలా తయారీలో వినియోగించే తీపి పదార్థం వల్ల ఒబెసిటీ వంటి శారీరక సమస్యలు, మరికొన్ని మానసిక సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి మగవారు కోలాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మరి.