ఆకాశంలో ఎగిరే ఆటోలు.. ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవట!

Thursday, January 11th, 2018, 08:09:31 AM IST

ప్రస్తుత రోజుల్లో ట్రాఫిక్ సమస్య ఏ రేంజ్ లో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజు రోజుకు ఈ సమస్య పెరుగుతూనే ఉంది గని తగ్గడం లేదు. ఇండియాలోని ప్రతి రాష్ట్రంలో ట్రాఫిక్ ఇబ్బందులను చూడాల్సి వస్తోంది. ఇక ఏ మాత్రం వర్షం పడినా చుక్కలు కనిపించాల్సిందే. ఇక అసలు విషయంలోకి వెళితే.. జర్మనీ అమెరికా వంటి దేశాల్లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు అక్కడి ప్రభుత్వాలు కొత్త ప్రయోగాలు చేశాయి. అదే విధానాన్ని ఇప్పుడు మనవాళ్లు కూడా ప్రయత్నించబోతున్నారట.

భవిష్యత్తులో డ్రోన్ రిక్షాలను అందుబాటులోకి తేనున్నారట. అంటే ఆకాశంలోనే ప్రయాణించవచ్చు. పైగా చార్జీలు కూడా తక్కువే. ఆటోలో ప్రయాణానికి ఎంత ఉంటుందో డ్రోన్ రిక్షాలకు కూడా అంతే ఉంటుంది. త్వరలోనే ఆ విధానం రాబోతోందని కేంద్రమంత్రి జయంత్ సిన్హా తెలియజేశారు. ప్రస్తుత రోజుల్లో ట్రాఫిక్ సమస్యలకు జనాలు హడలెత్తిపోతున్నారని ఇకపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుకున్న సమయానికి గమ్యం చేరుకోవచ్చని తెలిపారు. దేశంలోని ప్రధాన నగరాల్లో డ్రోన్ రిక్షాలు అందుబాటులోకి వస్తాయని కేంద్రమంది వివరించారు.