వైరల్ వీడియో:మాజీ లవర్ ఇంటిముందు మందులో ప్రేయసి తీన్ మార్ !

Monday, February 5th, 2018, 05:21:22 PM IST

ప్రస్తుత రోజుల్లో కొంత మంది అమ్మాయిలు ప్రవర్తోస్తోన్న తీరు నిజంగా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొందరైతే మగవారి కంటే ఏ మాత్రం తక్కువ కాదు అన్నట్లు చెడు దారుల్లో కూడా అన్ని హద్దులు దాటేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే రీసెంట్ గా ఓ యువతి పీకల దాకా తాగి తన మాజీ ప్రియుడి ఇంటి ముందు ప్రవర్తించిన తీరు ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది. హర్యానాలోని పటౌడిలో చోటు చేసుకున్న ఈ ఘటన యొక్క వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. తనను ప్రేమించిన అబ్బాయి గత కొంత కాలంగా మాట్లాడటం లేదని ఆ యువతి అతనికి ఇంటిముందే డ్యాన్స్ చేసింది. అంతే కాకుండా భారీ డీజే సిస్టమ్ ని కూడా తన వెంట తెచ్చుకుంది. రాజా హిందూస్థానీ సినిమాలోని ‘తేరే ఇష్క్ మే’ అనే సాంగ్ కి డ్యాన్స్ చేయడంతో స్థానికులు వింతగా చూడటం మొదలు పెట్టారు.