మద్యం తాగి కారు నడిపి, ఒకవ్యక్తిని బలిగొన్న యువతులు!

Monday, April 23rd, 2018, 12:30:40 PM IST

మద్యం సేవించి వాహనాలు నడుపవద్దని ప్రభుత్వం, పోలీస్ లు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా, డ్రంకెన్ డ్రైవ్ లు ఎన్ని నిర్వహించినా, తాగి నడపటంతో మీ ప్రాణాలకే కాదు ఎదుటోడి ప్రాణాలకు కూడా ముప్పేనంటూ ఎన్ని రకాలుగా చెప్పినా హైదరాబాద్ మహానగరంలో మందు సేవించేవారికి ఓ పట్టాన ఎక్కటం లేదు. పోలీసులు తనిఖీలు నిర్వహించి, కఠినమైన కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నా, డ్రైవింగ్ లైసెన్స్ లు క్యాన్సిల్ చేసినా అటువంటివారిలో వారిలో మార్పు మాత్రం రావటం లేదు. స్నేహితుల్ని వెంట పెట్టుకొని పార్టీలకు వెళ్లటం, ఫుల్ గా తాగేసి ఇష్టారాజ్యంగా డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. అమాయకుల ఉసురు తీస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో మరొకటి చోటు చేసుకుంది.

రాచకొండ పోలీస్ కమిషనరేట్ కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని డీఏఈ కాలనీ గేటు వద్ద ఆదివారం అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఏఎస్‌రావు నగర్ నుంచి తార్నాక వైపు వస్తున్న స్కోడా కారు డీఏఈ కాలనీ వద్ద రాత్రి 12:30గంటల సమయంలో అదుపు తప్పి డివైడర్ ఎక్కి గోడను ఢీకొంది. ఈ క్రమంలోనే ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న అశోక్ అనే చెప్పులు కుట్టుకునే వ్యక్తిపై నుంచి కారు దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కారులో నలుగురు శ్రీనిధి కళాశాలకు చెందిన బీటెక్ విద్యార్థినులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

పార్టీకి వెళ్లిన నలుగురు యువతులు ఫుల్ గా తాగేసి, పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ కారును ఇష్టారాజ్యంగా నడిపారు. కుషాయగూడ వద్దకు చేరుకునేసరికి వారి కారు అదుపు తప్పింది. దీంతో పుట్ పాత్ మీద నిద్రిస్తున్న చెప్పులు కుట్టే వ్యక్తి మీదకు కారును పోనివ్వడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇదిలా ఉంటే, కొందరు ధనిక వర్గాలకు చేయండిన యువతులు, తమకు పోలీస్ లు డ్రంక్ అండ్ డ్రైవ్ తనికీలు నిర్వహిస్తుంటే పోలీస్ ల పై దాడికి యత్నించిన సందర్భాలు లేకపోలేవు. కావున ప్రభుత్వం ఇకనైనా ఇలా తప్పతాగి మద్యం నడిపే వారిపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజలు అభిప్రాయపడుతున్నారు…….

  •  
  •  
  •  
  •  

Comments