పెళ్ళికి దారితీసిన మూగబధిరుల వాట్సాప్ ప్రేమ!

Tuesday, April 24th, 2018, 10:57:36 AM IST

ఆ ఇద్దరు జంట మూగబధిరులు. అయినప్పటికీ ఇద్దరు ఒక్కటయి వివాహం చేసుకున్నారు. అయితే ఇందులో గమ్మత్తయిన చిత్రం ఏమిటంటే ఇద్దరు వాట్సాప్ ద్వారా తొలుత అనుబంధాన్ని మొదలు పెట్టారు అలా మెల్లగా ఒకరిపై ఒకరికి ఆ అనుబంధం కాస్తా ప్రేమగా మారింది. వివరాల్లోకి వెళితే రాయచూర్ కు చెందిన ఈశ్వర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ పూర్తి చేసి ప్రస్తుతం హెచ్ఆర్బిఎల్ లో వుద్యోగం చేస్తున్నాడు. అలానే అశ్విని కూడా కంప్యూటర్ కోర్స్ పూర్తిచేసి ప్రస్తుతం బెంగళూరు లోని ఒక ప్రముఖ ప్రైవేట్ కంపెనీ లో వుద్యోగం చేస్తోంది. అయితే ఈశ్వర్, అశ్విని ఇద్దరు దివ్యాoగులే.

ఈశ్వర్ కు మాటలు రావు చెవులు వినపడవు. అశ్విని కూడా మూగ అమ్మాయే. అయినప్పటికి వీరి మధ్య తొడిగిన ప్రేమను పెద్దలు కాదనలేకపోయారు. పైగా ఇద్దరు కూడా మంచి చదువులు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. ఎలాగైనా కష్టపడి పైకిరావాలనేది ఇద్దరి తపన. అలా ఇద్దరి భావాలూ కలిసినపుడు మనం మాత్రం ఎందుకు కాదనాలో అని పెద్దలు కూడా ఒప్పుకున్నారు. కాగా మొన్న ఆదివారం బళ్లారి జిల్లా కొత్తూరు పట్టణం లోని బాణసంకరీ కల్యాణమండపంలో వారి వివాహం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది….

  •  
  •  
  •  
  •  

Comments