#RRR రూమర్స్ పై స్పందించిన నిర్మాత

Friday, June 8th, 2018, 05:10:09 PM IST

రాజమౌళి దర్శకతంలో తెరకెక్కనున్న #RRR ప్రాజెక్ట్ పై ప్రస్తుతం అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికి తెలిసిందే. రామ్ చరణ్ – జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా గురించి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి రూమర్స్ కూడా అదే రేంజ్ లో వస్తుండడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. రీసెంట్ గా సినిమా పునర్జన్మల నేపథ్యంలో ఉంటుందని ఒక టాక్ వచ్చింది.

అలాగే మరో రూమర్ కూడా బాగా వైరల్ అవుతోంది. 1995లో వచ్చిన బాలీవుడ్ కరణ్ అర్జున్ సినిమాకు #RRR రీమేక్ అని ఆ సినిమాలో షారుక్ సల్మాన్ నటిస్తే ఈ సినిమాలో తారక్ చరణ్ సరికొత్తగా కనిపించనున్నారు అని న్యూస్ వైరల్ అవ్వడంతో నిర్మాత డివివి.దానయ్య స్పందించారు. ఈ సినిమాపై వస్తున్న రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని పూర్తి వివరాలు ఒక నెల తరువాత అందరికి తెలుస్తాయని చెప్పారు. అదే విధంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ చరణ్ తప్పితే ఎవరి పాత్రలు ఫైనల్ కాలేదని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. అక్టోబర్ లో సినిమాను మొదలు పెట్టి 2020 సమ్మర్ లో సినిమా రిలీజ్ చేస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు.

  •  
  •  
  •  
  •  

Comments