రివ్యూ రాజా తీన్‌మార్ :ఈ నగరానికి ఏమైంది ? – కుర్రాళ్లకు కొంత రిలీఫ్

Friday, June 29th, 2018, 03:13:56 PM IST

తెరపై కనిపించిన వారు : విశ్వక్ సేన్ నాయుడు, సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను

కెప్టెన్ ఆఫ్ ‘ఈ నగరానికి ఏమైంది ?’ : తరుణ్ భాస్కర్

మూల కథ :
వివేక్ (విశ్వక్ సేన్ నాయుడు), కార్తిక్ (సుశాంత్ రెడ్డి), కౌశిక్ (అభినవ్ గోమఠం), ఉపేంద్ర (వెంకటేష్ కాకుమాను)లు నలుగురు చిన్ననాటి నుండి మంచి స్నేహితులు. వీరిలో వివేక్ డైరెక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ అతని లవ్ బ్రేకప్ అవ్వడంతో అతను డిప్రషన్ లోకి వెళ్లి నలుగురి మధ్య కొంత దూరం పెరుగుతుంది.

అలాంటి సమయంలో ఆ నలుగురిలో ఒకరైన కార్తిక్ కు పెళ్లి కుదరడంతో అందరూ బార్లో కలిసి మందు తాగుతారు. ఆ మత్తులోనే గోవా వరకు వెళ్ళిపోతారు. అలా వెళ్లిన ఆ నలుగురి జర్నీ ఎలా సాగింది, అసలైన జీవితానికి వాళ్ళు తెలుసుకున్న అర్థం ఏమిటి, చివరికి ఎవరి జీవితాలు ఎలా సెట్టయ్యాయి అనేదే తెరపై నడిచే సినిమా.

విజిల్ పోడు :
→  దర్శకుడు తరుణ్ భాస్కర్ రచనా విధానం మరోసారి ఇంప్రెస్ చేసింది. ఆయన పాత్రల్ని రాసిన విధానం, సంభాషణల్ని రాసిన తీరు, సన్నివేశాలని మలచిన విధానం చాలా బాగున్నాయి. సహజత్వం ఎక్కువగా ఉన్న ఈ సినిమాలో చాలా చోట్ల మంచి ఫన్ దొరికింది. కనుక మొదటి విజిల్ ఆయనకే వేయాలి.

→  నటుడు అభినవ్ గోమఠం కామెడీ టైమింగ్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. అతను వేసే ప్రతి పంచ్ బాగా పేలి బోలెడంత ఫన్ అందించింది. కాబట్టి అతనికే రెండో విజిల్ వేయాలి.

→  హీరో విశ్వక్ సేన్ మంచి నటనను కనబర్చగా, సెకండాఫ్లో స్నేహితులంతా జీవితానికి తెలుసుకునే అర్థం ఇంప్రెస్ చేశాయి. వివేక్ సాగర్ సంగీతం కూడ బాగుంది. ఈ అంశాలన్నింటికీ కలిపి మూడో విజిల్ వేయొచ్చు.

ఢమ్మాల్డుమ్మీల్ :

→  ఫస్టాఫ్లో స్నేహితుల నడుమ వచ్చే కొన్ని అనవసరమైన సన్నివేశాలు కొంత విసిగించాయి.

→  ప్రధాన పాత్ర వివేక్ యొక్క లవ్ స్టోరీ, బ్రేకప్ వంటి అంశాలు పెద్దగా ఆకట్టుకోలేదు.

→  అప్పటి వరకు నెగెటివ్ గా ఉన్న వివేక్ పెద్ద కారణాలు లేకుండా మంచిగా మారిపోవడం, స్నేహితులంతా కలిసి షార్ట్ ఫిలిం తీయడం అనే అంశాలు కొంత నాటకీయంగా అనిపిస్తాయి.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..
సినిమాలో పెద్దగా వింతగా తోచిన అంశాలేవీ లేవు.

సినిమా చూసిన ఇద్దరి స్నేహితుల మధ్యన సంభాషణ ఇలా ఉంది..

మిస్టర్ ఎ : బాగా ఎంజాయ్ చేశాం కదా సినిమాని !
మిస్టర్ బి : అవును.. చాలా రోజుల తర్వాత.
మిస్టర్ ఎ : రొటీన్ సినిమాలు చూసి చూసి విసిగిపోయిన మనకు కొంత రిలీఫ్ ఇచ్చింది.

  •  
  •  
  •  
  •  

Comments