షాకింగ్ న్యూస్ : హైదరాబాద్ లో భూకంపం

Wednesday, November 15th, 2017, 02:52:00 PM IST

హైదరాబాద్ నగరంలో చాలా రోజుల తర్వాత భూమి కంపించింది. జూబ్లీహిల్స్ లోని కేబీఆర్ పార్క్ లో భూకంపం వచ్చిందని ఎన్జీఆర్ఐ తెలిపింది. ఈ రోజు ఉదయం 8.30గంటల సమయంలో వచ్చిన ఈ భూకంప తీవ్రత చాలా చిన్నదాని రిక్టర్ స్కెల్ పై 0.5 గా నమోదైందని ఎన్జీఆర్ఐ వివరించింది. ఇక రోడ్ నెంబర్ 45 అలాగే దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో బూకంప ప్రభావం కనిపించిందని సమాచారం. ఒక నిమిషం పాటు ప్రకంపనలు వచ్చినట్టు నిపుణులు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త జనాల్లో పలు అనుమానాలు రేపుతోంది. కానీ భయపడాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా భూగర్భ వాతావరణంలో అనుకోని మార్పుల వల్ల చిన్నగా భూమి కంపించడం సాధారణమని పలువురు శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments