ఎల‌క్ష‌న్ క‌మీష‌న్‌: `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`ని అడ్డుకోలేం

Saturday, March 16th, 2019, 10:18:37 AM IST


ఎన్టీఆర్ జీవితంలోని కీల‌క గ‌ట్టం నేప‌థ్యంలో వివాద‌స్ప‌ద అంశాల్ని చ‌ర్చిస్తూ రామ్ గోపాల్‌వ‌ర్మ రూపొందించిన చిత్రం `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`. ఏపీ ఎన్నిక‌ల వేళ ఓట‌ర్ల‌ని ప్ర‌భావితం చేసేలా వున్న ఈ చిత్ర విడుద‌ల‌ని నిలిపి వేయాలంటూ టీడీపీకి చెందిన కొంత మంది నాయ‌కులు ఎల‌క్ష‌న్ క‌మీష‌న్‌ని సంప్ర‌దించారు. దీనిపై మూడు నాలుగు రోజులుగా జాతీయ ఎల‌క్ష‌న్ క‌మీష‌న్‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన రాష్ట్ర ఎన్నిక‌ల అధికారి ర‌జ‌త్‌కుమార్ `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` విడుద‌ల‌పై ఎలాంటి నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తారు?. అస‌లు సినిమాని బ్యాన్ చేస్తారా? ల‌ఏక విడుద‌ల‌కు అనుమ‌తి ఇస్తారా? అన్న ఉత్కంఠ నెల‌కొంది. అయితే `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` విడుద‌ల విష‌యంలో నెల‌కొన్న ప్ర‌తిష్ట‌భ‌న‌ను తొల‌గిస్తూ రాష్ట్న ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి క్లిరిటీ ఇచ్చారు.

ఈ చిత్ర విడుద‌ల‌ను అడ్డుకోలేమ‌ని స్ప‌ష్టం చేయ‌డంతో ఈ సినిమా విడుద‌లపై ఏర్ప‌డ్డ ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. ఎన్నిక‌ల క‌మీష‌న్ క్లారిటీ ఇవ్వ‌డంతో `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` అనుకున్న ప్ర‌కార‌మే ఈ నెల 22న విడుద‌ల కాబోతోంది. ల‌క్ష్మీ పార్వ‌తి కోణంలో రామ్‌గోపాల్‌వ‌ర్మ తెర‌కెక్కించిన ఈ సినిమా వివాదాస్ప‌దంగా వుంద‌ని గ‌త కొన్ని రోజులుగా టీడీపీ నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో వున్నందున సినిమాపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకునే వీలు లేద‌ని, సినిమా విడుద‌ల త‌రువాతే అది ఎంత వ‌ర‌కు ఓట‌ర్ల‌ని ప్ర‌భావితం చేస్తుంద‌న్న స‌న్నివేశాలు సినిమాలో వుంటే దాన్ని బ‌ట్టి చిత్ర బృందంపై చ‌ర్య‌లు తీసుకునే వీలుంటుంద‌ని ఎన్నిక‌ల అధికారి ర‌జ‌త్ కుమార్ స్ప‌ష్టం చేయ‌డంతో తెలుగు త‌మ్ముళ్లు నోరెళ్ల బెడుతున్నారు.