అప‌ద్ధ‌ర్మ సీఎం ప్ర‌భుత్వ‌ నిధులు వాడితే?!

Friday, September 28th, 2018, 01:47:44 PM IST

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో తేరాస ప్ర‌భుత్వం ప‌రిధులేంటి? అప‌ద్ధ‌ర్మ ప్ర‌భుత్వం కాబ‌ట్టి వీళ్ల‌కు నిధులు, విధులు, ప్ర‌చారం విష‌యంలో ఎంత‌వ‌ర‌కూ స్వేచ్ఛ ఉంటుంది? అంటే ఇదిగో ఇదే స‌మాధానం.

ఇప్ప‌టికే అప‌ద్ధ‌ర్మ ప్ర‌భుత్వం స‌హా అన్ని పార్టీల‌కు ఎన్నిక‌ల నియ‌మావళిని జారీ చేసింది ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ (ఈసీ). ప్ర‌త్యేకించి ఆపద్ధర్మ ప్రభుత్వాలకు ఎన్నికల నియమావళి ఎలా ఉంటుందో విడుదల చేయ‌డం ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌కొచ్చింది.
ఎన్నికల నియమావళి అన్ని విప‌క్ష‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు వ‌ర్తించిన‌ట్టే, ఆపద్ధర్మ ప్రభుత్వాలకు వర్తిస్తుంది. మళ్ళీ ఎన్నికలు జరిగి ప్రభుత్వం ఏర్పడే వరకు ఎన్నికల నియమావళి అమలులో ఉంటుంది. ఆపద్ధర్మ సీఎంగా కేసీఆర్ ఎలాంటి విధానపరమైన, కీలక నిర్ణయాలు తీసుకోవ‌డానికి లేదు. అధికారిక కార్యక్రమాలకు ప్రభుత్వ నిధులు అస‌లే వాడకూడదు. కొత్తపథకాలు, కార్యక్రమాలు ప్రారంభించ‌కూడదు. మంత్రుల పీఏలు ఇతర వ్యక్తిగత అధికారిక సిబ్బంది సేవలు వినియోగించుకోకూడదు. వాళ్ల‌కు నిధుల్ని త‌ర‌లించ‌కూడ‌దు. ఒక‌వేళ పై విష‌యాల్లో హ‌ద్దు మీరితే శిక్ష క‌ఠినంగా ఉంటుందని ఈసీ ప్ర‌క‌టించింది. దీంతో తేరాస అప‌ద్ధ‌ర్మ ప్ర‌భుత్వ ప‌రిమితులేంటో జ‌నాల‌కు కూడా ఓ క్లారిటీ ఇచ్చిన‌ట్ట‌య్యింది.