ఈసీ సంచలన నిర్ణయం – తాగి ఓటేస్తే ఇక జైలుకే

Thursday, December 6th, 2018, 03:54:35 PM IST

రోడ్ మీద ఎవరైనా తాగి వాహనం నడిపితే, వారితో ఫైన్ కట్టించుకోవడం కానీ వారిని జైలుకి తరలించడం కానీ మనం వినే ఉంటాం. కానీ తాజాగా ఈసీ దీనిమీద సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటంటే, ఎన్నడూ లేని విధంగా తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేయడానికి వచ్చే వారికి ముందుగా మందు పరీక్ష చేయబోతున్నారు. ఇది డ్రంకెన్ డ్రైవింగ్ కాదు.. డ్రంకెన్ పోలింగ్ అంటున్నారు. తాజాగా ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో పోలింగ్ బూత్ ల దగ్గర బ్రీత్ ఎనలైజర్లు పెడుతున్నారు పోలీసులు. తాగి వచ్చి ఓటు వేసే వారి వలననే మన దేశం ఇలా తయారవుతుందని ఈసీ నిబంధన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. తాగిన వారు ఓటు వేయడానికి అనర్హులని, ఈసీ నిబంధనమేరకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర బ్రీత్ ఎనలైజర్లు ఏర్పాటు చేసి తాగి వచ్చిన వారి మీద చర్యలు తీసుకోనున్నారు పోలీసులు.

పోలీస్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇప్పటికే ఆయా పోలీస్ స్టేషన్లకు బ్రీత్ ఎనలైజర్లు సప్లై చేశారు. ఎంతటివారైనా సరే లిక్కర్ తాగి పోలింగ్ కేంద్రాల దగ్గర కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇంతకుముందు ఎన్నడూలేని విధంగా డ్రంకెన్ పోలింగ్ నిబంధన తెరపైకి రావడం చర్చానీయాంశమైంది. పోలింగ్ నాడు సెలవుదినం కావడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉదయాన్నే సహజ సిద్ధంగా లభించే కల్లు తాగి, సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కు సమయం ఉండటంతో కాసింత విశ్రాంతి తీసుకుని ఓటు వేసేవారు చాలామంది ఉంటారు. కళ్ళు తాగిన కానీ బ్రీత్ ఎనలైజర్ మీటర్ లో చూపిస్తుందని అధికారులు చెబుతున్నారు. అందుకోసమనే జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు చెబుతున్నారు.