బాబు పోలీస్ గూఢ‌చ‌ర్యానికి ఈసీ షాక్‌

Tuesday, October 30th, 2018, 10:41:21 AM IST

తెలంగాణ రాజ‌కీయాల్ని ప్ర‌భావితం చేయాల‌నుకున్న చంద్ర‌బాబు ఎత్తుల్ని ఈసీ చిత్తు చేస్తోందా? అంటే తాజా ప‌రిణామాలు నిజ‌మే అనేలా వున్నాయి. తెలంగాణ‌లో ముందస్తు న‌గారా మోగిన ద‌గ్గ‌రి నుంచి ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఎత్తులు వేయ‌డం మొద‌లుపెట్టిన విష‌యం తెలిసిందే. అందులో భాగంగానే కాంగ్రెస్‌తో క‌లిసి ఎప్పుడూ లేని విధంగా క‌నీవినీ ఎరుగ‌ని పొత్తుకు సిద్ధ‌మై అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురిచేశాడు. చంద్ర‌బాబు ఎన్నిక‌ల పొత్తు నుంచే తెలంగాణ‌లో త‌న ప్యూహాల‌కు ప‌దును పెట్టాడు.

రాష్ట్రంలో త‌మ అభ్య‌ర్థుల గెలుపు ఓట‌ముల గురించి స‌మ‌గ్రంగా తెలుసు కోవ‌డం కోసం, దానితో పాటు ఉద్య‌మ స‌మ‌యంలో త‌మ పార్టీని వీడి తెరాస‌లో క‌లిసిన వారిని తిరిగి నాయానో భ‌యానో మ‌ళ్లీ పార్టీలోకి తీసుకురావ‌ల‌నే ప్యూహంలో భాగంగా ఏపీ ఇంట‌లిజెన్స్ పోలీసుల‌ను చంద్ర‌బాబు తెలంగాణ జిల్లాల్లో సీక్రెట్‌గా రంగంలోకి దింపిన విష‌యం తెలిసిందే. దీనిపై తెరాస శ్రేణులు, ముఖ్యంగా కేటీఆర్ ఆగ్ర‌హించి రాష్ట్ర ఎన్నిక‌ల అధికారి ర‌జ‌త్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ర‌జ‌త్‌కుమార్ చంద్ర‌బాబుకు దిమ్మ‌దిరిగే షాకిచ్చారు.

తెలంగాణ ఎన్నిక‌ల వేళ‌ ఏపీ పోలీసుల‌కు ఇక్క‌డ ప్ర‌వేశం లేద‌ని, వారు తెలంగాణ ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసే అవాకాశం వుంద‌ని, వారు త‌ప్ప మిగ‌తా రాష్ట్రాల‌కు చెందిన పోలీస్‌ల‌ను మాత్ర‌మే ఎన్నిక‌ల బందోబ‌స్తుకు వినియోగిస్తామ‌ని ర‌జ‌త్ స్ప‌ష్టం చేయ‌డంతో చంద్ర‌బాబు నోట్లో ప‌చ్చివెళ‌క్కాయ ప‌డినంత ప‌నైంది. ఇటీవ‌ల తెలంగాణ జిల్లాల్లో ఏపీ పోలీసులు ర‌హ‌స్య స‌ర్వే నిర్వ‌హించ‌డంపై సీరియ‌స్ అయిన ఈసీ ఇందుకు ఏపీ డీజీపీని వివ‌ర‌ణ కోరింది. ఇప్ప‌టికీ వివ‌ర‌ణ రాక‌పోవ‌డంతో ఎన్నిక‌ల విధుల నిర్వ‌హ‌ణ నుంచి ఏపీ పోలీసుల‌ను త‌ప్పిస్తూ మిగ‌తా రాష్ట్రాల‌కు చెందిన పోలీస్ ల‌ను మాత్ర‌మే అందుకు వినియోగించాల‌ని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయ‌డం ప్ర‌ధాన్య‌త‌ను సంత‌రించుకుంది.