వైయ‌స్ జ‌గ‌న్‌కి ఈడీ స‌మ‌న్లు

Sunday, September 18th, 2016, 12:12:54 AM IST

jagan
అక్ర‌మాస్తుల కేసులో వైయ‌స్ జ‌గ‌న్‌కి ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (ఈడీ) నుంచి స‌మ‌న్లు అందాయి. దివంగ‌త వైయ‌స్ అనుయాయుడు, వైయ‌స్సార్ సీపీ పార్ల‌మెంట్ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి, రాంకీ ఫార్మా అధినేత అయోధ్య రామిరెడ్డి త‌దిత‌ర నిందితులకు ఈడీ స‌మ‌న్లు పంపింది. జ‌గ‌న్ ఆస్తులు రాంకీ సంస్థ అక్ర‌మార్జ‌న‌లు చ‌ట్ట విరుద్ధం అంటూ ఈ స‌మ‌న్లు పంపారు. రాంకీ పెట్టుబ‌డులు , మ‌నీ లాండ‌రింగ్ కి సంబంధించి స‌ద‌రు అక్ర‌మార్కులు స‌మాధానం చెప్పాలంటూ ఈ స‌మ‌న్లు అందాయి.

జ‌గ‌న్‌కి చెందిన సాక్షి ప‌త్రిక‌, సాక్షి టీవీ ఆస్తులు ఇప్ప‌టికే ఈడీ అటాచ్‌మెంట్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా రాంకీకి సంబంధించిన స‌మ‌న్లు అందుకోవ‌డం ప్ర‌స్తుతం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు తావిచ్చింది.