వ్యవహారం చౌదరి వరకు వచ్చేసరికి వణుకు మొదలైంది !

Thursday, October 11th, 2018, 10:00:03 PM IST

తెలంగాణలో ఓటుకు నోటు కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కుంటున్న ఒకప్పటి టీడీపీ నేత, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డిపై జరిగిన ఐటీ దాడుల నుండి టీడీపీ తేరుకోకముందే ఈడీ అధికార పార్టీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి మీద దాడులు నిర్వహించింది. సోమవారం అకస్మాత్తుగా జరిగిన ఈ దాడుల్లో చౌదరికి చెందిన సుమారు 100 కంపెనీలకు సంబందించి కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఎన్ని వాస్తవమైనవో, ఎన్ని నకిలీ కంపెనీలో త్వరలోనే తేల్చనున్నారు అధికారులు.

గతంలో కూడ విదేశీ బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టారనే ఆరోపణలు ఎదుర్కొన సుజనాపై జరిగిఆన్ ఈ దాడులు పలు అనుమానాలకు తావివ్వడమే కాకుండా అధికార పార్ట్ అండతో అక్రమార్జనకు పాలపడుతున్న ఎంతో మంది నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సుజనా లాంటి తిమింగలాన్నే వదల్లేదంటే మనం లాంటి పిల్ల చేతల పరిస్థితి ఏమిటని చాలా మంది దేశం నాయకులు వణుకుతున్నారట. ఇక తెలంగాణలో ఐటీ దాడుల్ని మరువక ముందే ఈడీ సోదాలు మొదలవడం చంద్రబాబుకు కూడ కొంత కంగారుని కలిగిస్తోంది.