బిసీసీఐ కి భారీ దెబ్బ.. 121 కోట్ల జరిమానా!!

Friday, June 1st, 2018, 09:09:15 PM IST

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) భారత క్రికెట్ కు పెద్ద షాక్ ఇచ్చింది. బిసిసిఐకి ఎన్నడు లేని విధంగా జరిమానా విధించడం ప్రపంచ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరచింది. ఫెమా నిబంధలను ఉల్లగించినందుకే బిసిసిఐ రూ.82.66 కోట్ల జరిమానా వేసింది. అలాగే అప్పట్లో బోర్డుకు పెద్దగా కొనసాగిన శ్రీనివాసన్‌కు రూ.11.53 కోట్లు మాజీ ఐపీఎల్ కమిషనర్ లలిత్‌ మోదీకి రూ.10.65 కోట్లు జరిమానాలు విధించబడ్డాయి. అలాగే బోర్డు మాజీ కోశాధికారి పాండవ్‌కు రూ. 9.72 కోట్లు స్టేట్ బ్యాంక్ లో విలీనమైన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెన్‌కోర్‌ రూ.7 కోట్ల జరిమానాను ఈడీ విధించింది.

ఈ లెక్క మొత్తం 121.56 కోట్లకు చేరింది. అసలు మ్యాటర్ లోకి వెళితే.. 2009లో ఐపీఎల్ ను దక్షిణాఫ్రికాలో జరిపిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ టోర్నీని నిర్వహించడానికి 243 కోట్లను అక్కడికి బదిలీ చేశారు. ఎవరు పట్టించుకోరులే అని వీళ్లంతా నిబంధనలకు విరుద్ధంగా క్రికెట్ దక్షిణాఫ్రికా ఖాతాకు పంపేసింది. అందుకు గాను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెన్‌కోర్‌ బ్యాంక్ ను వినియోగించుకున్నారు. అసలైతే అలాంటి డబ్బును ఇతర దేశాలకు ట్రాన్స్ ఫర్ చేయాలనీ అనుకున్నప్పుడు కొత్తగా ఇండియాలోనే ఒక బ్యాంక్ ఎకౌంట్ ఓపెన్ చెయ్యాలి. అది రూల్. భారత నిఘా, దర్యాప్తు సంస్థల పరిధిలోకి ఆ ఖాతా వస్తుంది కావున సరైన పద్ధతి. కానీ అలా కాకుండా బిసిసిఐ అలాగే ఐపీఎల్ నిర్వహకులు నిఘా సంస్థల నుంచి తప్పించుకోవాలని ఎలాంటి ఇబ్బంది ఉండదని బదిలీ చేశారు. విదేశీ మారక నిర్వహణ (ఫెమా) నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఇటీవల రుజువు కావడంతో వెంటనే ఈడీ అందరికి జరిమానా విధించింది.

  •  
  •  
  •  
  •  

Comments