షాకింగ్ : జగన్ మీద హత్యకు 8 నెలల ముందే పక్కా ప్లాన్..!

Sunday, October 28th, 2018, 09:03:30 PM IST

ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మీద శ్రీనివాస రావు అనే యువకుడు కోళ్ల పందాలకు వినియోగించే కత్తితో దాడికి పాల్పడిన సంగతి తెలిసినదే.ఇప్పటికే పోలీసులు అతన్ని అదుపు లోకి తీసుకొని విచారిస్తున్నారు.అయితే శ్రీనివాసరావు జగన్ పై దాడికి కోళ్ల పందాలకు వినియోగించే కత్తినే వాడటం వెనుక చాలా పెద్ద కథే దాగి ఉందని, పైగా జగన్ పై జరిగిన దాడికి దాదాపు 8 నెలల క్రితమే పథకం వేసుకున్నారని కొన్ని సంచలన నిజాలు వారికి తెలిశాయని వైసీపీ శ్రేణులు తెలుపుతున్నారు.అసలు శ్రీనివాస రావు అనే యువకుడు ఎవరు ఏ ప్రాంతానికి చెందినవాడు అతని ముందు శేష జీవితం ఏమిటి అని ఆరా తియ్యగా జగన్ పై కోడి పందాల కత్తితోనే ఎందుకు దాడి చేసాడో తెలుస్తుంది.

శ్రీనివాసరావు కోడి పందాలలో ఆరి తేరినవాడని,ఈ ఏడాది జనవరిలో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఒకసారి జరిగిన భారీ కోళ్ల పందాలలో తన దృష్టి శ్రీనివాసరావు మీద పడగా అతన్ని సంప్రదించి రామకృష్ణ సన్నిహితుడైనటువంటి విశాఖ ఎయిర్ పోర్ట్ లోని రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరి దగ్గర పనిలో పెట్టాడని,అందులోను శ్రీనివాసరావు కు హర్ష వర్ధనే 20 వేల జీతం ఇవ్వడమే కాకుండా అతనికి అక్కడి దగ్గరలోనే అద్దెకు ఉంటున్న శ్రీనివాస్ యొక్క ఇంటికి కూడా అద్దె తానే కడుతున్నాడని తెలిసింది.

అంత జీతం ఇవ్వడమే కాకుండా అతని యొక్క ఇంటి అద్దె కూడా తానే కట్టడంతో ఈ అనుమానాలు మరింత బలమయ్యాయని వైసీపీ శ్రేణులు వ్యక్తం చేశారు.జగన్ పై దాడి చేసినటువంటి కత్తులు కూడా అక్కడే వారు దాచి ఉంచారని,శ్రీనివాస్ కు తప్ప మిగతా వాళ్ళు అందరికి పదివేల లోపు జీతం ఇస్తుంటే అతనికి 20 వేలు జీతం ఇవ్వడం కూడా అనుమానాలు రేకెత్తించేలా ఉందని మొత్తానికి జగన్ పై హత్యా యత్నానికి పథకం వేశారని తెలుస్తుంది అని వైసీపీ నేతలు అంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments