11న ఎన్నికల కమిషన్ టీమ్ రాక‌..

Saturday, September 8th, 2018, 01:55:43 AM IST

ముంద‌స్తు ఎన్నిక‌ల హీట్ స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిచ్చింది. న‌వంబ‌ర్‌లో ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌న్న ప్ర‌చారం సాగుతోంది. ఈ సంద‌ర్భంగా తెలంగాణలో ఓటర్ లిస్ట్, పోలింగ్ స్టేషన్ అంటూ ఒక‌టే ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర‌లేచింది. లేటెస్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ ఇచ్చిన వివ‌రాలు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. ఇప్ప‌టికే ఎన్నిక‌ల‌కు సంబంధించి ప్రాథమిక రిపోర్ట్ ఢిల్లీకి ఇచ్చాం. దీంతో మా అవసరాలపైనా అక్క‌డివారు స్పందించారని ఆయ‌న తెలిపారు.

ఈవీఎం, వివిపిఏటీ సరఫరా తగినంత లేద‌ని వాటిని త‌గినంత‌గా ఇవ్వాల‌ని అడిగాం. దీంతో బీఈఎల్‌ నుండి సప్లై చెయ్యాలని వారు నిర్ణయించారు. అలానే ఆంధ్రా లో కలిపిన 7 మండలాలకు సంబంధించిన‌ పునర్విభజన అంశంపై హోమ్ శాఖ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. తెలంగాణ వ్యాప్తంగా 32574 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈసారి అంత‌కుమించి ఎన్ని ఎక్కువ తీసుకోవాలి? అన్న‌దానిపైనా ఇంకా నిర్ణ‌యించ‌లేదు. సోమవారం నాడు ఎన్నికల కమిషన్ కు ప‌లు అంశాల‌పై స‌మ‌గ్ర‌ నివేదిక అందిస్తాం. అటుపై ఈనెల 11న ఎన్నికల కమిషన్ టీమ్ ఇక్క‌డ‌కు వస్తోంది. రాజకీయ పార్టీల ప్ర‌ముఖుల‌తో క‌మీష‌న్ చ‌ర్చిస్తుంది. వారు ఇచ్చిన నివేదిక .. మా అవ‌స‌రంపై ఆధార‌ప‌డి వివ‌రాలు వెలువ‌రిస్తాం. ఎన్నికల నిర్వహణ కు అధికారులు కూడా పరీక్ష పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఈనెల‌ 9వ తేదీ నుండి ఈవీఎం మెషీన్లు రాష్ట్రానికి వ‌చ్చే అవ‌కాశం ఉంది.. అంటూ వేడెక్కించే వివ‌రాల్ని అందించారు.

  •  
  •  
  •  
  •  

Comments