ఈ జాబితాలో `జ‌న‌సేన‌` లేదేం?

Tuesday, September 11th, 2018, 02:48:40 PM IST

గ‌త కొంత‌కాలంగా జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ పొలిటిక‌ల్ వార్‌ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఆ క్ర‌మంలోనే జ‌న‌సేన‌ పార్టీ ఇరు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తుందా? లేదా? అన్న సందిగ్ధ‌త నెల‌కొంది. ఇదివ‌ర‌కూ ఓ సంద‌ర్భంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నామ‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు. అయితే దానిపై అభిమానుల‌కు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌కు పూర్తి స్థాయి క్లారిటీ లేదు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో అంద‌రికంటే ముందే ఎన్నిక‌లు జ‌రిగే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి జ‌న‌సేన పార్టీ ఇక్క‌డ పోటీ చేస్తుందా.. లేదా? ప‌వ‌న్ ఎందుకు దీనిపై స్పందించ‌డం లేదు? అంటూ ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి.

తాజా స‌న్నివేశం చూస్తుంటే అస‌లు జ‌న‌సేనాని ఇటువైపు చూస్తున్న‌ట్టే క‌నిపించ‌డం లేదు. అత‌డు ఏపీని త‌ప్ప తెలంగాణ‌ను పట్టించుకోక‌పోవ‌డం చ‌ర్చ‌కొచ్చింది. తెలంగాణ‌లో ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లపై నేడు సమీక్ష సాగుతోంది. ఈ బుధ‌వారం ఉద‌యం హై లెవెల్ ఎలక్షన్ కమిషన్ సభ్యుల బృందం హైదరాబాద్ సందర్శించనుంది. కేంద్ర ఎన్నిక‌ల బృందం రాజ‌ధానిలో రెండు రోజులపాటు పర్యటించనుంది. సచివాలయం సౌత్ హెచ్ బ్లాక్ మొదటి అంతస్తులో ఉన్న సీఈఓ కార్యాలయంలో భేటీ ఉంటుంద‌ని తెలిసింది. అలాగే ఎన్నిక‌ల సంఘం వాళ్లు అన్ని రాజకీయ పార్టీలతో బుధ‌వారం సాయంత్రం 6 గం. ల 30 ని. లకు భేటీ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరూ లేదా ముగ్గురు ప్రతినిధులను ఆ మేర‌కు ఆహ్వానించారు. గుర్తింపు పొందిన 9 రాజకీయ పార్టీలకు ఈసీ కేటాయించిన సమయాల వివరాలు ప‌రిశీలిస్తే ఇలా ఉన్నాయి. అయితే వీటిలో జ‌న‌సేన‌కు స‌మ‌యం కేటాయించలేదు. అంటే ఇక ఆ పార్టీ తెలంగాణ ఎన్నిక‌ల బ‌రిలో లేన‌ట్టేన‌ని డిక్లేర్ అయిన‌ట్టేనా? అంటూ ముచ్చ‌ట సాగుతోంది.

ఎన్నిక‌ల సంఘం మీటింగ్ ఈ పార్టీల‌తోనే..
బీఎస్పీ: సా 6:30 నుంచి 6:40
బీజేపీ: సా 6:40 నుంచి 6:50
సీపీఐ: సా 6:50 నుంచి 7:00
సీపీఐ (ఎం): సా 7:00 నుంచి 7:10
ఐఎన్సీ: సా 7:10 నుంచి 7:20
మజ్లిస్: సా 7:20 నుంచి 7:30
టీఆర్ఎస్: సా 7:30 నుంచి 7:40
టీడీపీ: సా 7:40 నుంచి 7:50
వైఎస్ఆర్‌సీపి: సా 7:50 నుంచి 8:00

  •  
  •  
  •  
  •  

Comments