ఎన్నికల షెడ్యూల్ ను ఇతరులు ప్రకటించడం తప్పు : చీఫ్ ఎలక్షన్ కమిషనర్

Friday, September 7th, 2018, 07:00:21 PM IST

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల హడావుడి మొదలయిందని టీఆరెస్ మొదటి ప్రచార వేదికతో క్లియర్ గా అర్థమైంది. ఇకపోతే అసెంబ్లీ సమావేశాలను రద్దు చేసిన అనంతరం కేసీఆర్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ప్రతిపక్ష నేతలు కేసీఆర్ చేసిన ఒక కామెంట్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయాన్నీ ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది. కానీ నవంబర్ లోనే ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ చెప్పడం పెను దుమారాన్ని రేపాయి.

ఎన్నికలు ఎప్పుడు వస్తాయో కూడా కేసీఆర్ చెప్పేస్తారా? అంటూ ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. ఇక ఈ విషయంపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ స్పందించారు. ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించి కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు తాను మీడియాలో చూశానని తెలుపుతూ… ఎన్నికల షెడ్యూల్ ను ఇతరులు ప్రకటించడం తప్పని అన్నారు. ఎన్నికల సంఘం కాకుండా ఇతరులేవరు కూడా ప్రకటించకూడదని కేసీఆర్ చేశింబ వ్యాఖ్యలను ఖండించారు. ఇక అసెంబ్లీ ఇతర సభలో ఎన్నికల తేదీలను పొలిటీషియన్స్ ప్రకటించడం దురదృష్టకరమని అన్నారు.

ఎన్నికల గురించి మాట్లాడుతూ.. మరో వారం రోజుల్లోగా తెలంగాణాలో జరిగే ఎన్నికల పై ఒక నిర్ణయం తీసుకుంటాం. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు ఒకేసారి జరుగుతాయా లేదా అనే విషయాన్నీ ముందే చెప్పలేము. రాష్ట్రంలో ఎలక్షన్స్ నిర్వహించే ముందు స్టేట్ ఎలక్షన్స్ కమిటీ నివేధిక వచ్చిన అనంతరం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల కోసం అన్ని వసతులు సిద్దమై ఉంటె ముందుగానే ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఓపీ రావత్ వివరణ ఇచ్చారు.

  •  
  •  
  •  
  •  

Comments