ఎల‌క్ష‌న్ డే థియేట‌ర్ల‌కి హాలీడే లేదా?

Thursday, December 6th, 2018, 03:26:57 PM IST

డిసెంబ‌ర్ 7న తెలంగాణ రాష్ర్టం ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఎన్నిక‌ల క‌మీష‌న్ ప్ర‌భుత్వ ఆఫీస్ ల‌తో పాటు, ప్ర‌యివేట్ సంస్థ‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టించాల‌ని ఆదేశాలిచ్చింది. ప‌ల్లె నుంచి ప‌ట్ట‌ణం వ‌ర‌కూ, చాయ్ బండి నుంచి స్టార్ రెంట్ వ‌ర‌కూ అన్నీ బంద్. నియ‌మావ‌ళిని ఉల్ల‌ఘింస్తే భారీ ఫైన్ త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించింది. దీంతో దాదాపు డిసెబంర్ 7 అన్నీ మూత ప‌డ‌టం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. వీలైనంత వ‌ర‌కూ అధిక శాతం ఓటింగ్ పోల‌వ్వాల‌ననే కమీష‌న్ స్ర్టిక్ట్ గా వ్వ‌వ‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈ నిబంధ‌న తెలగాణ వ్యాప్తంగా ఉన్న‌ థియేట‌ర్ల‌కు వ‌ర్తించ‌దా? అంటే అవున‌నే తెలుస్తోంది. డిసెంబ‌ర్ 7వ తేదిన యాధావిధిగా సినిమాలు రిలీజ్ కానున్నాయి. అదీ ఏకంగా 7, 8 మిది పేరున్న సినిమాల‌తో పాటు, ప‌లు చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి.

దానికి సంబంధించిన రిలీజ్ డేట్ల‌ను కూడా నెల రోజుల క్రిత‌మే ప్ర‌క‌టించారు. ఈనేప‌థ్యంలో ఇదెక్క‌డి న్యాయం అంటూ కొన్ని కార్పో రేట్ కంపెనీలు ఎన్నిక‌ల క‌మీష‌న్ ను ప్ర‌శ్నిస్తున్నాయి. కంపెనీలో ప‌నిచేసే ఉద్యోగులు క‌న్నా థియేట‌ర్ల‌కు వెళ్లే సినీ ప్రియులే ఎక్కువ‌న్న విష‌యం ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ కు తెలియదా? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. హైద‌రాబాద్ లో ఒక్క రోజు సెల‌వంటే లక్ష‌ల్లో, కోట్ల‌ల‌లో న‌ష్టం వ‌స్తుంది. మ‌రి థియేట‌ర్ల‌కు మిన‌హాయింపు ఇచ్చి మిగ‌తా సంస్థ‌ల ప‌ట్ల ఎందుకు? ప‌క్ష‌పాత వైఖ‌రి ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లు మండి ప‌డుతున్నారు. ఓట్లు వేయ‌డానికి ఆఫీస్ ల్లో అనుమ‌తి తీసుకుంటే? స‌రిపోతుంది క‌దా? అందుకోసం మొత్తానికి ప‌నే మానేసుకుని ఓటేయండి అన‌డం ఎంత వ‌ర‌కూ న్యాయ‌మో ఎన్నిక‌ల క‌మీష‌న్ కే తెలియాలంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.