నేడే విడుదల

Tuesday, September 16th, 2014, 02:45:57 AM IST


ఈనెల 13న జరిగిన తెలంగాణలోని మెదక్ పార్లమెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ లోని నందిగామ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. రెండు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపుకోసం ఆయా రాష్ట్రాల ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఎన్నికల ఫలితాలు కోసం అన్నిపార్టీలు ఎదురుచూస్తున్నాయి.
అయితే, పోటీచేసిన పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ.. ఆయా అభ్యర్దుల ఫలితాలు ఈవీయంలలో భద్రపరచబడ్డాయి. రేపు మధ్యాహ్నానికి మెదక్ కోటలో పాగా వేసేది ఎవరో.. అటు నందిగామలో ఎ పార్టీ జెండా ఎగరవేస్తుందో.. తెలిసిపోతుంది.