13 చోట్ల ముగిసిన ఎన్నికలు తెలంగాణా ఎన్నికల అధికారి

Friday, December 7th, 2018, 05:40:30 PM IST

నేడు జరిగిన తెలంగాణలో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చాలా ప్రాంతాల్లో ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. ముందే తెలియజేసినట్లుగా 13 నియోజకవర్గాల్లో పోలింగ్‌ ముగిసింది. 4 గంటల సమయానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారికి మాత్రమే ఓటు వేసే హక్కును కల్పించారు. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక్కడ కూడా 5 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారికి మాత్రమే ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తున్నామని ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ ఒక ప్రకటనలో చెప్పారు.

కొన్ని కొన్ని ఇబ్బందికర ప్రాంతాల్లో, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం, సిర్పూర్‌, చెన్నూర్‌, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. 4గంటల వరకు పీలింగ్ కేంద్రాల్లో ఉన్న వారు మాత్రమే తమ ఓటు హక్కును వాడుకున్నారు. ఇంకా మిగిలిన ప్రాంతాల్లో కూడా పోలింగ్ ముగియనుందని ఎన్నికల అధికారి తెలియజేశారు.