షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలంటున్న చిన్నబాబు!

Thursday, June 28th, 2018, 12:20:45 AM IST


ప్రస్తుతం ముందస్తు ఎన్నికలు అనే వాదన దేశవ్యాప్తగా సంచలనం రేపుతోంది. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వార్తకు పార్టీలు కొంత అంతర్మథనంలో పడ్డట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణాలో అధికారంలోవున్న టిఆర్ఎస్ పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉన్నప్పటికీ ఇటు ఏపీలో మాత్రం టీడీపీ నేతలు జంకుతున్నారట. అయితే వారు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ముందస్తు ఎన్నికలొచ్చినా భయపడేది లేదని పైపైకి కబుర్లు చెపుతున్నారనేది కొందరి వాదన. దీనికి ప్రధాన కారణం టీడీపీపై కొన్ని చోట్ల వ్యతిరేకత వున్న నేపథ్యంలో ఇప్పుడే ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాల్లో పడ్డారట అక్కడి నేతలు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే వారి పరిస్థితి కొంత కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు. ఇకపోతే ముందస్తు ఎన్నికలు పెద్ద విషయమేమి కాదని టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు, మరియు మంత్రి అయిన నారా లోకేష్ అంటున్నారు. నేడు అమరావతిలో మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలు మన రాష్ట్రంలో వచ్చే అవకాశం లేదని,

అయితే మోడీ ప్రభుత్వం చెపుతున్నట్లు తమకు అవి వస్తాయన్న భయం అంతకంటే లేదని, ఎన్నికలెప్పుడు వచ్చినా కార్యకర్తలు, నేతలు వాటిని ఎదుర్కోవడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారని అన్నారు. అయినా కూడా తాను చెపుతున్నట్లు టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లు తప్పక పరిపాలన చేపడుతుందని, ఈ ఏడాదిలోగా వీలైనన్ని పథకాలతో ప్రజల్లోకి వెళ్లి వారికి మరింత చేరువవుతామని, కాబట్టి రానున్న ఎన్నికల్లో తప్పక విజయం మాదే అని ధీమా వ్యక్తం చేసారు చిన్న బాబు లోకేష్. అయితే 2004 సమయంలో ప్రజలిచ్చిన అధికారం పూర్తికాక ముందే చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లారని, మరి అలాంటపుడు పార్టీ పరిస్థితి బాగుందని ధీమా వ్యక్తం చేస్తున్న అయన అప్పటివలె ముందస్తుగానే ఎన్నికలొస్తే మాత్రం టీడీపీకి నష్టమేమి ఉండదు కదా అని ప్రతిపక్ష పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నాయి…..