వీడియో : దేవుడు ముందే తన మనిషిని చంపుకున్న ఏనుగు!

Sunday, May 27th, 2018, 02:45:48 AM IST

తమిళనాడు తిరుచ్చి లో దారుణం చోటు చేసుకుంది. ఒక ఏనుగు మనిషిని చంపిన విధానం అందరిని భయానికి గురి చేసింది. అది కూడా చిన్నప్పటి నుంచి ఆ ఏనుగును అల్లారు ముద్దుగు పెంచుకున్న మావిటిని అది దారుణంగా బలిగొంది. అసలు వివరాల్లోకి వెళితే.. తిరుచ్చి జిల్లా సమయంపురం లో ఏనుగు బీభత్సం సృష్టించింది. స్థానిక మరియమ్మన్ ఆలయంలో దేవుడి ముందు పెంచి పోషించిన మావిటిని ఏనుగు ఉహించని విధంగా కడ తేర్చించి.

మరియమ్మన్ అనే ఆలయంలో గజేంద్రుడు అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా ఒక ఏనుగు బాగోగులు చూసుకుంటున్నాడు. అయితే రీసెంట్ గా గుడిలో ఓ ఉత్సవం సందర్బంగా ఏనుగును మావిటి ప్రజల్లోకి తెచ్చాడు. చుట్టూ జనాన్నీ చూసిన ఏనుగు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెంటనే ఉన్నట్టుండి తన మావిటి పై దాడికి దిగింది. ఇష్టం ఉన్నట్టుగా అతనిని కాలుతో తొక్కడంతో మావిటి గాయపడ్డాడు. సన్నిహితులు అతన్ని కాపాడేందుకు ప్రయత్నించగా ఏనుగు వారికీ అవకాశం ఇవ్వలేదు. తీవ్రంగా గాయపడ్డ ఆ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. అనంతరం ఆలయ సిబ్బంది మరికొంత మంది మావిటీలు మదమెక్కిన ఏనుగును గొలుసులతో కట్టేసి అదుపులోకి తీసుకున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments