భీబత్సం సృష్టిస్తున్న ఏనుగులు! గాయాల పాలైన రైతులు!

Thursday, September 13th, 2018, 04:30:22 PM IST

అడవిలో ఉండాల్సిన గజరాజులు పంట పొలాలు మీద పడి నాశనం చేస్తున్నాయి. అడ్డుకోబోయిన రైతుల మీద దాడి చేస్తున్నాయి. గత కొద్ధి రోజులుగా విజయనగర ప్రాంత రైతులు అక్కడి నివాసులు అక్కడే స్వైర విహారం చేస్తున్న ఏనుగుల బారి నుంచి తమని తాము కాపాడుకోడానికి వారి జీవనాధారమైన పంట పొలాలను కాపాడుకోడానికి వాటితో పోరాటం చేస్తున్నారు.అయితే ఈ ఘటన కేవలం ఇప్పుడు మాత్రమే జరగలేదు నాలుగు రోజులు క్రితం కూడా జరిగింది అయినా సరే ప్రభుత్వ అధికారులు తమ గోడు పట్టించుకోవట్లేదు అని అక్కడి ప్రాంత ప్రజలు వాపోతున్నారు.

విజయనగరం జిల్లా, కొమరాడ మండలం,గుణావపురం లోని ప్రాంతం లోకి అడవుల్లోనుంచి ఏనుగులు తప్పించుకొని వచ్చేసాయి అడవుల్లో కన్నా ఇక్కడ ఆహరం, నీరు సమృద్ధిగా దొరకడంతో ఇక అక్కడే తిష్ట వేసాయి. ఇష్టమొచ్చినట్టు పంటపొలాల్లో దూరి తినేస్తూ నాశనం చేస్తున్నాయి, వారి జీవనాధారమైన పంట కల్ల ముందు నాశనం అయ్యిపోతుండడంతో వారు ఆగలేక ఆ ఏనుగులకు ఎదురు వెళ్లారు దానితో ఆ ఏనుగులు ఇంకా రెచ్చిపోయి వారి మీద దాడి చెయ్యడం మొదలు పెట్టాయి. దీనితో అక్కడి రైతులు గాయాలపాలయ్యి ఆసుపత్రిలో చేరారు. ఇంత జరుగుతున్న వారిని పట్టించుకునే ప్రభుత్వ అధికారి ఒక్కడు కూడా లేడు. తక్షణమే అధికారులు చర్యలు తీస్కొని ఆ ఏనుగులను అక్కడి నుంచి తరలించాలని అక్కడి ప్రాంత రైతులు కోరుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments