తెరకెక్కనున్న అజారుద్దీన్ కధ..!

Thursday, January 8th, 2015, 06:36:57 PM IST

emraan-hasmi-azaradin
ఈ మధ్యకాలంలో క్రీడాకారుల లైఫ్ హిస్టరీని సినిమాలుగా తీస్తున్నారు. ఇప్పుడు ఈ బాటలో ఒకనాటి క్రికెటర్, మాజీ కాంగ్రెస్ ఎంపి అజారుద్దీన్ లైఫ్ హిస్టరీని కూడా చేరనున్నది. అజారుద్దీన్ పాత్రలో ఇమ్రాజ్ హస్మీ నటిస్తున్నారు. ఇక, సంగీత బిజిలాని పాత్రకోసం కరీనా కపూర్ ను సంప్రదిస్తున్నట్టు తెలుస్తున్నది. ఏక్తాకపూర్ నిర్మాణ సారధ్యంలో సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తున్నది. ఇక అజారుద్దీన్ మొదటి భార్య నౌరీన్ పాత్రను ప్రాచీదేశాయ్ పోషిస్తున్నది. 1987లో అజారుద్దీన్ నౌరీన్ ను పెళ్ళాడాడు. అనంతరం కొద్ది కాలం తరువాత ఆమెకు విడాకులు ఇచ్చి 1996లో సంగీతా బిజిలానిని పెళ్లిచేసుకున్నాడు. ఇక ఆయన క్రీడాజీవితంలో జరిగిన మార్పులు, మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో క్రీడలకు స్వస్తి పలకడం, అలాగే, రాజకీయ ప్రవేశం వంటి మలుపులు అనేకం ఉండటంతో ఆయన లైఫ్ హిస్టరీని బియోపిక్ గా తీస్తున్నారు.