ముగిసిన సర్పంచుల నామినేషన్స్…

Thursday, January 10th, 2019, 03:00:55 PM IST

తెలంగాణలోని అన్ని గ్రామాల్లో జరగనున్న మొదటివిడుత గ్రామా పంచాయితీ ఎన్నికలకి సంబందించిన నామినేషన్స్ పూర్తయ్యాయి… సర్పంచ్‌ స్థానాలకు అన్ని గ్రామాల్లోకూడా అధికార తెరాస పార్టీ అభ్యర్థులే అధికంగా పోటీ పడుతున్నారు. ఈ విషయంలో అన్ని నియోజక వర్గాల ప్రతినిధులు జోక్యం చేసుకునేందుకు ఆసక్తిగా లేరు. కానీ అవసరమున్న గ్రామాల్లో మండల స్థాయి నాయకులే సమన్వయ పరుస్తున్నారు. ఒక మండలానికి సంబంధించి కొన్ని గ్రామాల్లో మినహా మిగతా అన్ని చోట్ల పోటీ గట్టిగానే ఉండబోతుంది. అంతే కాకుండా కొన్ని కొన్ని గ్రామాల్లోఇప్పటికే ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి… కొత్తగా తెలిసిన విషయమేంటంటే కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అంతగా సుముఖంగా లేరని సమాచారం.

ఈ పంచాయితీ ఎన్నికల విషయాలలో ఏకగ్రీవం అంశాన్ని ప్రస్తవించొద్దని ఇప్పటికే ఎన్నికల అధికారులు చెప్పినప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో మాత్రం ఆ మాటలని పేద చెవినపెట్టారనిసమాచారం. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు వేలం పాటలు నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలుంటాయని జిల్లా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసుశాఖ సైతం హెచ్చరించింది. దీంతో ఒకటీ, రెండు గ్రామాల్లో రహస్యంగా వేలం పాటలు జరిగాయనే ఊహాగానాలు వినిపించాయి. అధికారులు మాత్రంఅలాంటివి ఎం జరగలేదని చెప్పడం గమనార్హం.