థియేటర్ లో సీటే చంపేసింది!

Thursday, March 22nd, 2018, 02:32:07 PM IST

మనిషికే జీవితంలో ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో ఎవ్వరికి తెలియదు. జీవితం చాలా సంతోషంగా గడుస్తోంది అనుకుంటున్న సమయంలో కొన్ని చిన్న కారణాలే ఊహించని విధంగా దెబ్బ కొడతాయి. ముఖ్యంగా చావును చూపించడంలో చిన్న విషయాలే ప్రధాన పాత్ర పోషిస్తాయి. సినిమాకెళ్లిన ఓ వ్యక్తి సీట్ల మధ్య ఇరుక్కోవడం వలన చనిపోయాడు అంటే ఎవరైనా నమ్మ గలరా?. కానీ అధిక నిజంగా జరిగింది. ఊహించని విధంగా చోటు చేసుకున్న ఈ ఘటన ఇంగ్లాడ్ లో చోటు చేసుకుంది. బర్మింగ్‌హామ్‌ – స్టార్‌ సిటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కాంప్లెక్స్‌లో ఉన్న వ్యూ సినిమా థియేటర్‌లో ఈ ఘటన జరిగింది.

అసలు వివరాల్లోకి వెళితే.. లగ్జరీ సీటులో కూర్చొని హ్యాపీగా సినిమాను ఎంజాయ్ చేస్తోన్న ఓ వ్యక్తి మొబైల్ కిందపడటంతో తీసుకోవడానికి ప్రయత్నించాడు. రెండు సీట్ల మధ్య తల పెట్టగా అలానే ఇరుక్కపోయింది. దురదృష్టవశాత్తు సీటు యొక్క ఎలక్ట్రానిక్‌ ఫుట్‌ రెస్ట్‌ కూడా తలకు తగలడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. థియేటర్ యాజమాన్యం వెంటనే వచ్చి అతన్ని బయటకు తీయడానికి చాలా కష్టపడ్డారు. కానీ ఫలితం లేకపోవడంతో కుర్చీని విరగొట్టి బయటకు తీశారు. అతను గాయపడటంతో పాటు గగుండె పోటుకు కూడా గురయ్యాడు. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లి చిక్కిత్స చేయించారు. అయితే అతను వారం రోజుల తరువాత హాస్పిటల్ లోనే కన్నుమూయడం అందరిని షాక్ కి గురి చేసింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకొని అసలు అతను నిజంగా సీటు కారణంగా చనిపోయాడా అని విచారణ చేపట్టారు.