తలతెగినా కూడా ఆ పాము వదల్లేదు!

Thursday, June 7th, 2018, 09:57:50 PM IST

పాములు పగబడితే అస్సలు వదలవని పెద్దలు చెబుతుంటారు. చాలా వరకు కనిపించిన వెంటనే ఉపిరిపోయేంత వరకు చంపేసి మంటలో కాల్చేస్తారు. అయితే ఒక వ్యక్తి చచ్చింది అనుకొనిక్ ఒక పామును ముట్టుకోవడంతో అది కాటేసింది. దీంతో ఆ వ్యక్తి ప్రాణం పోయేవరకు పరిస్థితి వచ్చింది. రెండు ముక్కలైన ఆ పాము కాటు వేయడం చూసి అది ఎంతగా పగబట్టిందో అని అందరు కామెంట్స్ చేస్తున్నారు.

అసలు వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని టెక్సాస్ లో ఒక ఇంటి పెరట్లో మీలో, జెన్నీఫర్‌లు అనే ఇద్దరు భార్యాభర్తలు పని చేసుకుంటున్నారు. అయితే ఎవరు ఊహించని విధంగా జెన్నిఫర్ కు ఒక రాటిల్ స్నేక్ కనిపించింది. దాన్ని చూసి బెదిరిపోయిన ఆ మహిళా వెంటనే కత్తితో ఒక్క వేటు వేయడంతో పాము రెండు ముక్కలైంది. విషయం తెలుసుకున్న ఆమె భర్త మీలో వచ్చి పాము చనిపోయింది అనుకోని తల పట్టుకున్నాడు. దీంతో కోన ఊపిరితో ఉన్న ఆ పాము అతని చేతిపై కాటు వేయడంతో వెంటనే అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే హాస్పిటల్ కి తరలించడంతో వైద్యులు శ్రమించి అతన్ని రక్షించారు.

  •  
  •  
  •  
  •  

Comments