ఏపీలో బెట్టింగ్ లో కూడా కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారుగా…?

Saturday, May 18th, 2019, 01:04:25 PM IST

ఏపీలో ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరొక వారం రోజుల్లో వెలువడనున్నాయి… ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు… అయితే ఈ ఎన్నికల ఫలితాలు దగ్గరపడే కొద్దీ ఏపీలో బెట్టింగుల జోరు కూడా ఊపందుకుంది. ఇప్పటికే చాలా మంది బెట్టింగులు పెట్టారు. కానీ ఫలితాలు దగ్గరవ్వగానే బెట్టింగులో కూడా చాలా వరకు మార్పులు చేపట్టారు… కాగా కొందరైతే బెట్టింగ్ రాయుళ్లు సర్వేలను నమ్ముకుని డబ్బులు పెట్టారు. ఈ బెట్టింగులు నగరాలు, పట్టణాల్లోనే కాదు. పల్లెల్లో కూడా బీభత్సంగా బెట్టింగులు పెడుతున్నారు. అయితే బెట్టింగ్ పెట్టడానికి ముందు లెక్కలు అన్ని సరి చూసుకొని మరీ బెట్టింగులకు ఆశ పడుతున్నారు కొందరు ఆశావహులు…

అయితే ఈ బెట్టింగులు నిర్వహించే వారు కూడా రాజకీయ నాయకులకి దగ్గరగా ఉండే వారిని సంప్రదించి మరీ బెటింగులు కాస్తున్నారంట. అంతేకాకుండా వారికి సంబందించిన వారు ఎవరైనా మీడియా లో ఉంటె వారిని సంప్రదించి మరీ బెట్టింగులకు పాల్పడుతున్నారంట బుకీలు… ‘ఏ పార్టీకి అనుకూలంగా ఉంది? ఏమైనా సర్వేలు చేశారా? ఏ పార్టీపై పెడితే బెటర్’ లాంటి ప్రశ్నలు వేస్తూ, వారికి కావాల్సిన సమాధానం తీసుకోని మరీ ఈ ప్రయోగాలకి ప్రజలను ప్రభావితమ చేస్తున్నారు. కానీ ఇందులో చాలా మంది ఓడిపోక తప్పదు. ఏది ఏమైనా కూడా మరో వారం రోజుల్లో ఎవరు గెలుస్తారో తెలిసిపోతుంది.