ట్రక్ ఢీకొట్టినప్పటికీ చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు !

Thursday, February 22nd, 2018, 02:56:48 PM IST

మనం కొందరు మరణం అంచులవరకు వెళ్లి ప్రాణ గండం నుండి బయటపడ్డ ఉదంతాలు అక్కడక్కడా చూస్తుంటాం. ఇటీవల జరిగిన ఒక ఘటనలో ట్రక్ తో ఢీకొట్టబడిన ఒక వ్యక్తికి చిన్న గాయం కూడా కాలేదు. పైగా ఘటన అనంతరం మన వాడు హాయిగా మాములుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ సంఘటన ఫిబ్రవరి 20వ తారీఖున గుజరాత్లోని గోద్రాలో జరిగింది. బిజీగా ఉన్న రహదారిపై రోడ్ దాటుతున్న ఒక వ్యక్తిని అటుగా వెళ్తున్న ఒక ట్రక్ ఢీకొట్టింది. అయితే ఢీకొట్టిన వెంటనే అమాంతం అతడు రెండు పల్టీలు కొట్టాడు. ఆ ఘటనకు భయపడిపోయిన ట్రక్ డ్రైవర్ ట్రక్ ను పక్కకు ఆపాడు, అయితే ఆ పక్కగా వెళ్తున్న ఒక బైక్ రైడర్ అటు తిరిగి చూడగా పల్టీలు కొట్టిన వ్యక్తి లేచి ఒళ్ళు దులుపుకుని చక్కగా వెళ్లిపోవడం అతన్ని మరియు అక్కడున్నవారిని ఆశర్యచకితుల్ని చేసింది. ఈ సంఘటనను అక్కడి వ్యక్తి ఒకరు తన మొబైల్ లో వీడియో తీసి సామాజిక మాధ్యమం లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. అందుకేనేమో మన పెద్దలంటారు భూమి మీద నూకలుంటే ఎటువంటి ప్రమాదమొచ్చినా మనల్ని ఏమి చేయలేదని….