ప్రతి జన సైనికుడూ పవన్ కి గన్ మేనె కదా : పరుచూరి గోపాలకృష్ణ

Thursday, April 19th, 2018, 11:30:06 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రత్యేక హోదా ఉద్యమం కోసం తనదైన రీతిలో పోరాడుతున్నారు. అలానే వామపక్షాలతో ఆయన కలిసి పోరాటాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. అయితే ఆయన ప్రస్తుతం ప్రజల మధ్య తిరుగుతుండడంతో ఆంధ్ర ప్రభుత్వం ఆయనకు గన్ మెన్ లను ఏర్పాటు చేసింది. అయితే ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ సర్కారు తన భద్రతకు నియమించిన నలుగురు గన్‌మెన్‌ను సినీన‌టుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వెనక్కి పంపిన విష‌యం తెలిసిందే. వారిద్వారా ప‌వ‌న్‌పై స‌ర్కారు నిఘా పెట్టిందని, అందుకే ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని ఊహాగానాలు వినపడుతున్నాయి.

ఈ విషయంపై సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ స్పందిస్తూ పవన్ నిర్ణయాన్ని ప్రశంసించారు. ‘పవన్ కల్యాణ్ తన భద్రత కోసం ప్రభుత్వం ఇచ్చిన 2 ప్లస్ 2 గన్ మెన్ సౌకర్యాన్ని వదులుకున్నాడట. ప్రతి జన సైనికుడూ తనకు ఒక గన్‌మెనే కదా. దమ్ముతో దుమ్ము రేపేవాళ్లు వెనక్కి తిరిగి చూడరు. వెనక చూపు చూసుకోడానికి వెంట జనసైన్యం ఉంది, ఆ పక్క ఈ పక్క వామపక్షాలున్నాయి. ప్రశ్నించడమే గెలుపుగా సాగిపో అంటూ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్‌ చేసి పవన్‌ను ఆయన ప్రోత్సహించారు…..

  •  
  •  
  •  
  •  

Comments