మనిషి తన జీవిత కాలంలో ముద్దులు పెట్టడానికి ఎంత సమయం వెచ్చిస్తాడో తెలుసా..!

Tuesday, June 7th, 2016, 02:07:57 AM IST


ఎదుటి మినిషి మీద మనకున్న ప్రేమను తెలియజేయడానికి ఉన్న ఒకేఒక ఉత్తమమైన మార్గం ముద్దు. అది తల్లిదండ్రులు పిల్లల మీదైనా, పిల్లలు తల్లి దండ్రుల మీదైనా, భార్యాభార్తలైనా, ప్రేమికులైనా, స్నేహితులైనా ఎవరైనా సరే తమ ప్రేమను మాటల్లో కాకుండా చేతల్లో చూపడానికి ముద్దునే ఉపయోగిస్తారు. అలా ప్రతి మనిషీ జీవితంలో ముద్దును ఇవ్వాల్సిందే, పొందాల్సిందే.

మనిషి మాటల ద్వారా చెప్పలేని తన భావాలను ముద్దు ద్వారా పంచుకుంటాడు. తన అనుబందాలను బట్టి, ఆవేశాలను బట్టి ముద్దులో ఉండే తీవ్రత కూడా మారుతూ ఉంటుంది. ఆ తీవ్రత తల్లిదండ్రులు, బిడ్డల మధ్య ఒకరకంగా, స్నేహితుల మధ్య ఒకరకంగా, ప్రేమికుల మధ్య ఒకరకంగా, భార్యా భార్తల మధ్య ఒకరకంగా ఉంటుంది. ఇలా ప్రతి మనిషి తన జీవిత కాలంలో ముద్దులు పెట్టడానికి 20,160 నిముషాలను ఉపయోగిస్తాడట. అంటే మనిషి జీవితంలో ముద్దు ప్రాముఖ్యత ఎంత గొప్పదో అర్థమవుతుంది.