సార్వ‌త్రిక ఎన్నిక‌లు 2019 : బీజేపీ టార్గెట్ చేసిన ప్రాంతాల్లోనే ఈవీఎంల మొరాయింపు..?

Tuesday, April 23rd, 2019, 09:10:19 PM IST

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు మూడు విడ‌త‌ల పోలింగ్ పూర్త‌యిన సంగ‌తి తెలిసిందే. ఈ మూడు విడ‌త‌ల్లోనూ ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు ఈవీఎంల మొరాయింపు అనే మాట పోలింగ్ జ‌రుగుతున్న ప్ర‌తీ చోట వినిపిస్తూనే ఉంది. మొదటి విడ‌త పోలింగ్ జ‌రిగిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు 30 శాతం పోలింగ్ బూత్‌ల‌లో ఓటింగ్ ప్రారంభం కాలేదు. అదే సీన్ రెండో విడ‌త పోలింగ్ జ‌రిగిన త‌మిళ‌నాడులోనే రిపీటైంది. మూడో విడ‌త పోలింగ్ జ‌రుగుతున్న యూపీలోనూ అదే ప‌రిస్థితి ఉంది.

పోలింగ్ తీరును చూసి స‌మాజ్‌వాదిపార్టీ నేత అఖిలేష్ యాద‌వ్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. రూ.50వేల కోట్లు ఖ‌ర్చుపెట్టి ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్న‌ప్పుడు ఇలాంటి ప‌రిస్థితులు ఎందుకు వ‌స్తున్నాయ‌ని డీజీట‌ల్ ఇండియాలో ఈవీఎంలు ప‌నిచేయ‌వా..? అంటూ ప‌రోక్షంగా బీజేపీపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇలా ఈసీని, కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన వారిలో మొన్న టీడీపీ జాతీయ అధ్య‌క్షులు చంద్ర‌బాబు, నిన్న డీఎంకే నేత స్టాలిన్‌, నేడు అఖిలేష్ యాద‌వ్‌, ఇలా ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఈవీఎంల ప‌నితీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న నేత‌ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. బీజేపీ తీవ్రంగా టార్గెట్ చేసిన ప్రాంతాల్లోనే ఈవీఎంలు మొరాయిస్తున్నాయ‌న్న ప్ర‌చారం ఉద్రిక్తంగా సాగుతోంది.