సీబీఐ లోనే అవినీతి జరగడంపై జేడీ లక్ష్మీ నారాయణ సంచలన వ్యాఖ్యలు.!

Wednesday, October 24th, 2018, 02:03:36 PM IST

అవినీతిపరులకు సిబిఐ పేరు చెప్తే ఎలాంటి వణుకు పుడుతుందో నిజజీవితంలోనూ పలు చిత్రాల్లోనూ మనం చూసి ఉంటాం అయితే అలాంటి అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించే సి.బి.ఐ వ్యవస్థలోనే అధికారులు అవినీతికి పాల్పడ్డారని గత రెండు రోజులుగా వస్తున్న వార్తలు పెను సంచలనానికి దారి తీసాయి. ఇప్పుడు సి.బి.ఐ అధికారుల మీద అవినీతి ఆరోపణలతో దాడులు జరగడం పట్ల మాజీ సి.బి.ఐ అధికారి జేడీ లక్ష్మీనారాయణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జె డి లక్ష్మీనారాయణ తాను పని చేసినప్పుడు పలు ముఖ్య రాజకీయ నాయకుల అక్రమాస్తుల కేసుల విషయంలో కీలక పాత్ర వహించారు.

లంచగొండితనాన్ని అలాంటి చర్యలకు పాల్పడిన రాజకీయ నాయకుల పట్ల సింహస్వప్నంగా నిలిచే సి.బి.ఐ వ్యవస్థలోనే అవినీతి ఆరోపణలు రావడం చాలా బాధాకరమని జేడీ తెలిపారు ఇలాంటి ఆరోపణలు సిబిఐ మీద రావడం వల్ల ప్రజల్లో విశ్వసనీయత ఎంతవరకు ఉంటుంది అన్నది ప్రశ్నఅని జేడీ అన్నారు.తాను గత ఈ రెండు రోజులు నుంచి వస్తున్న ఈ వార్తలను చూసి ఆశ్చర్యపోయానని,అయితే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న సి.బి.ఐ డైరెక్టర్ రాకేష్ పై కావాలనే ఆరోపణలు కేసులు పెడుతున్నారన్న వార్తలు కూడా తాను చదివానని తెలిపారు.త్వరలోనే ఇప్పుడు వారు చేస్తున్నవంటి దర్యాప్తుని పూర్తి చేస్తే ప్రజలందరికి ఒక క్లారిటీ వస్తుందని,అందుకోసం అయినా వారు ఈ కేసును త్వరగా పూర్తి చేస్తారని భావిస్తున్నానని జేడీ లక్ష్మీ నారాయణ తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments